calender_icon.png 25 December, 2024 | 6:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆస్పత్రిలో శ్రీతేజ్‌ను పరామర్శించిన ఎంపీ డీకే అరుణ

24-12-2024 03:44:19 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన స్వార్థ రాజకీయాల కోసం వాడుకోవడం సరికాదని, అల్లు అర్జున్ పట్లు దారణంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ ఎంపీ డీకే అరుణ ఆరోపించారు. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం డీకే అరుణ మాట్లాడుతూ... సంధ్య థియేటర్ ఘటనను రాజకీయం చేయడం తగదని, లేనిపక్ష్యంలో చిత్రపరిశ్రమపై రాష్ట్ర ప్రభుత్ర వేధింపులుగా భావిస్తామన్నారు. 

ఇక్కడ సినిమా హీరోలా..?, రాజకీయ నాయకులా..? మరొకరా..? అనే విషయం పక్కన పెట్టి సినీ పరిశ్రమ, రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబానికి అండగా ఉండాలని ఆమె సూచించారు. తొక్కిసలాటలో రేవతి మరణించడం బాధాకరం, శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని భగవంతుడిని కోరుకుంటున్నానన్నారు. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా తగ్గిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీలు ఒకటేనని అసెంబ్లీలో జరిగిన తీరును చూస్తే అర్థమవుతుందని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకే రేవంత్ రెడ్డి సర్కార్ ఇలాంటి వ్యవహారాలను రాజకీయం చేస్తుందని డీకే అరుణ ఆరోపించారు.