27-03-2025 02:21:45 PM
పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన ఎంపీ డీకే అరుణ
మహబూబ్ నగర్, (విజయక్రాంతి): ఎండ్ల తరబడి వెనకబడిన పాలమూరుకు ప్రత్యేక సదుపాయాలను కల్పించాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వానికి ఉందని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ(Mahabubnagar MP DK Aruna) అన్నారు. గురువారం లోకసభలో పాలమూరుకు (Indian Institutes of Information Technology) కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎంపీ డీకే అరుణ కోరారు. మా పార్లమెంట్ పరిధిలో అన్ని రకాల పరిశ్రమలు ఉన్నాయని, వాటిల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన వారు వందల మంది పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా మా మహబూబ్ నగర్ పార్లమెంట్ లో (IIIT) ట్రిపుల్ ఐటి ఏర్పాటు చేస్తే మహబూబ్ నగర్ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు.
మా పాలమూరు(Palamuru) యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఇవ్వ గల్గుతాయని, మా మహబూబ్ నగర్ పార్లమెంట్ అన్ని విధాలుగా అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. ఈ ఐఐఐటీ ఏర్పాటు ఉద్దేశ్యం సభ్యులందరికీ తెలిసిందే అన్నారు. జాతీయస్థాయిలో విద్యార్థులు, ఉన్నతమైన స్థానాలు చేరేందుకు ఈ ఐఐఐటీలు ఎంతగానో ఉపకరిస్తాయని పేర్కొన్నారు. జాతీయస్థాయిలో ఐటీ రంగంలో ఇన్నోవెటివ్స్ ఇంప్రూవర్మెంట్ చెందవచ్చని, ఐటీ రంగంలో ఉన్నతమైన లక్ష్యాలు సాధించొచ్చుచని తెలిపారు. కొత్త ఆలోచనలకు పునాది వేసే ఆలోచన అడుగు ముందు పడుతుందని పేర్కొన్నారు. సామాజికి సృహతోపాటు, ప్రస్తుత పోటీ ప్రపంచంతో కలిసి ముందుకెళ్లొచన్నారు. రూరల్ ఏరియాల్లోని ఔత్సాహికులకు, పోత్సాహంతోపాటు, ఎన్నో ఉపాధి అవకాశాలు కలుగుతాయని తెలిపారు.
జాతీయ అంతర్జాతీ స్థాయిలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా సులువుగా సాధించే అవకాశం ఉందన్నారు. ట్రిపుల్ ఐటీ లేక పోవడం వల్లమా పరిధిలో పరిశ్రమలు ఉన్నప్పటికీ.. వాటిల్లో స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఇవ్వలేకపోతున్నామన్నారు. మహబూబ్ నగర్ లాంటి రూరల్ ప్రాంతాల్లో ఐఐఐటి ఏర్పాటు చేయడం వల్ల ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని మా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం వేదికగా త్రిబుల్ ఐటీ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని విన్నవించారు