హైదరాబాద్,(విజయక్రాంతి): ఫార్మాసిటీ తమకొద్దంటూ రైతులు ధర్నా చేశారని బీజేపీ జాతీయ ఉపధ్యాక్షురాలు, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ పేర్కొన్నారు. రైతులు చేపట్టిన ధర్నాకు తను మద్దుతుగా వెళ్లినప్పుడు స్వచ్ఛందంగా ప్రజలు వచ్చారని, తమా ప్రాణాలు పోయినా సరే.. ఫార్మాసిటీని అడ్డుకుంటామని రైతులు చెప్పారు. ప్రభుత్వ భూముల్లో ఏవైనా పరిశ్రమలు పెట్టుకోమని అక్కడి రైతులు తనతో చెప్పినట్లు అరుణ తెలిపారు. ప్రభుత్వం భూముల్లో కాకుండా రైతుల భూములు లాక్కొని ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తే తమకు భూములు లేకపోతే జీవనాధారాన్ని కోల్పోతామని రైతులు ఆవేదన చెందారని వెల్లడించారు. రైతులకు ఎంత ప్యాకేజీ ఇచ్చినా తమ భూములు మాత్రం ఇవ్వమని చెప్పారన్నారు. పంతానికో, పట్టింపులకో పోవద్దని, పట్టా భూముల జోలికి వెళ్లొద్దని గతంలో ముఖ్యమంత్రిని హెచ్చరించిన్నట్లు డీకే అరుణ వ్యాఖ్యానించారు.