calender_icon.png 6 February, 2025 | 10:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాటలు చెప్పడం కాదు.. మంచి చేయండి..

06-02-2025 07:33:08 PM

వసతిగృహలలో అసలు ఏం జరుగుతుంది..

నామమాత్రంగా చర్యలు తీసుకుంటున్నామని ప్రకటిస్తే సరిపోతుందా..?

విద్యార్థుల ప్రాణాలు పోతున్న పట్టింపు లేదా..? 

మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ.. 

మహబూబ్ నగర్ (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం కనీసము వసతి గృహాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు కూడా రక్షణ కల్పించలేని దుస్థితిలో ఉండడం బాధాకరమని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అసహనం వ్యక్తం చేశారు. ఢిల్లీ నుంచి బాలనగర్ లో రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న ఆరాధ్య విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మాటలు కోటలు దాటుతున్నాయని.. మంచి చదువుల కోసం తల్లిదండ్రులు తమ బిడ్డలను ప్రభుత్వాన్ని నమ్మి గురుకుల పాఠశాలలకు పంపిస్తే వారి ప్రాణాలకే రక్షణ లేకుంటే ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నించారు.

వరుసగా ఘటనలు జరుగుతున్న ప్రభుత్వము నామమాత్రపు చర్యలు తీసుకుంటూ విద్యార్థులకు భరోసా కల్పించడం లేదని పేర్కొన్నారు. విద్యార్థిని వృత్తికి సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ డి జానకి నీ ఫోన్ ద్వారా అడిగి తెలుసుకున్నారు. సమగ్ర విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలన్నారు.