calender_icon.png 15 November, 2024 | 1:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కలెక్టర్‌పై దాడి.. ఖండించిన ఎంపీ డీకే అరుణ

11-11-2024 04:59:33 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా కలెక్టర్ కారుపై రైతులు రాళ్లు విసిరిన ఘటనపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ స్పంధించారు. కొడంగల్ నియోజకవర్గం దుగ్యాల మండలం లగచర్ల గ్రామంలో జిల్లా, కలెక్టర్, తహసీల్దార్ పై జరిగిన దాడులు సమంజసం కాదని ఎంపీ డీకే అరుణ అన్నారు. 'పోరాటాలు చేసి ప్రశ్నించాలి తప్ప.. దాడులు చేయడం మంచి పద్ధతి కాదు' అని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కాబట్టి ఆయనతో మాట్లాడుకొని సమస్యలను పరిష్కరించుకోవాలని చెప్పారు. గ్రామస్థుల సమస్యలు తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని డీకే అరుణ పేర్కొన్నారు. 

వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, తహశీల్దార్ కార్లపై రైతులు రాళ్లు విసిరాడంతో అద్దాలు ధ్వసం అయ్యాయి. ఫార్మా విలేజ్ భూసేకరణలో భాగంగా రైతులతో చర్చలకు వచ్చిన కలెక్టర్ లగచర్లకు రెండు కిలోమీటర్ల దూరంలో అధికారులు గ్రామసభ ఏర్పాటు చేశారు. ఊరి బయట చర్చలకు సభ ఏర్పాట్లు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన రైతులు కలెక్టర్ ప్రతీక్ తో చర్చల కోసం గ్రామసభ వద్దకు రాలేదు. గ్రామసభ వద్ద ఉన్న ఇద్దరు రైతుల అభ్యంతరంతో లగచర్ల గ్రామంలోనే రైతులతో చర్చించేందుకు వెళ్లిన కలెక్టర్ ప్రతీక్ జైన్ కు వ్యతిరేకంగా రైతులు నినాదాలు చేస్తూ, వెనక్కి వెళ్లిపోవాలంటూ కారుపై రాళ్లుతో దాడి చేశారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ ప్రతీక్ జైన్ కారు దిగి రైతులతో చర్చించేందుకు వచ్చినప్పటికీ నినాదాలు చేశారు. దీంతో అధికారులు గ్రామం నుంచి వెళ్లిపోయారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గ్రామంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.