04-03-2025 11:29:16 PM
మహిళా దినోత్సవ వేడుకల్లో ఎంపీ డీకే అరుణ..
ఎల్బీనగర్: హైదరాబాద్ నాగోల్ లోని పీఎంఆర్ కన్వెన్షన్ లో రెడ్డి విమెన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ హాజరయ్యారు. ఈ సందర్భంగా డీకే అరుణను స రెడ్డి మహిళా అసోసియేషన్ సభ్యులు ఘనంగా సన్మానించారు. పలు రంగాల్లో ప్రావీణ్యం సాధించిన మహిళలను ఎంపీ అరుణ శాలువాతో సత్కరించారు. వేడుకల్లో ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ.. మహిళ అది పరాశక్తి రూపం అని, మహిళ అనుకుంటే ఏదైనా సాధించగలదన్నారు. నేడు మహిళా అన్ని రంగాల్లోనూ తన సత్తా ఏంటో నిరూపించుకుంటోందని, నారీ శక్తి ముందు ఏ శక్తి నిలువ లేదన్నారు.
కుటుంబ పోషణలో, అభివృద్ధిలో ఇవాళ మహిళలది కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు. మహిళల శక్తిని ప్రధాని మోడీ గుర్తించి, చట్టసభలో మహిళలకు 33% శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చారని తెలిపారు. భేటీ బచావో.. భేటీ పదావో పథకాలు తెచ్చారన్నారు. ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాజకీయాల్లోకి రావలానికునే వారికి 33% రిజర్వేషన్ సువర్ణ అవకాశమని సూచించారు. మహిళలు రాజకీయాల్లో రాణించాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉన్నదన్నార.
స్టార్టప్ లకు 2 కోట్ల వరకు సాయం..
ప్రప్రథమంగా కేంద్ర బడ్జెట్ లో మహిళలకు కేంద్ర పెద్ద పీట వేసిందని గుర్తు చేశారు. పారిశ్రామిక రంగంలో ఔత్సాహిక మహిళలకు కేంద్రం రు. 2కోట్ల వరకు నిధులు ఇవ్వనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రెడ్డి మహిళా సంఘం నాయకురాలు, ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.