calender_icon.png 4 October, 2024 | 10:44 PM

పార్టీలకు అతీతంగా జోగులంబా ఆలయాలను అభివృద్ధి కృషి

04-10-2024 08:56:38 PM

రాష్ట్రం దేశం సుభిక్షంగా ఉండాలి

జోగులాంబ రైల్వే హాల్టును అభివృద్ధి చేస్తున్నాం

ప్రసాద్ స్కీం భవనం భక్తులకు ఒక వరం

మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ

అలంపూర్,(విజయక్రాంతి): రాష్ట్రంలో ఏకైక శక్తి పీఠంగా విరాజిల్లుతున్న జోగులంబా,బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేసుకోవాలని మహబూబ్ నగర్ బిజెపి ఎంపీ డీకే అరుణ అన్నారు. జోగులాంబ అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలని ఆమె కోరారు. శుక్రవారం జోగులాంబ దేవస్థానంలో నిర్వహిస్తున్న శరన్నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా ఆమె ఆలయాలను దర్శించుకున్నారు. అనంతరం ఉభయ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ... రాష్ట్రం నలుమూలల నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు వస్తారని ప్రసాద్ స్కీం కింద రూ .23 కోట్లతో చేపట్టిన భవనం భక్తులకు వరమన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్రమోదీ ప్రసాద్ స్కీం కింద అమ్మవారి పుణ్యక్షేత్రంలో భవనం నిర్మించి భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేయడం సంతోషకరమని తెలిపారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కృషితో జోగులంబా రైల్వే హల్ట్ రూపురేఖలు మారుతున్నాయని తెలిపారు. మంత్రి రైల్వే హల్ట్ కోసం ప్రత్యేక నిధులు కేటాయించి పనులను శరవేగంగా జరుగుతుండడం సంతోషకరమని తెలిపారు.

ఆలయ నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఛైర్మన్, ధర్మకర్తలకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు.జోగులాంబ ఆశీస్సులతో ఆలయాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళ్లాలని పాలకమండలని కోరారు. ఆలయాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పాలకమండలి సౌకర్యాలు కల్పించాలని తెలిపారు కార్యక్రమంలోజోగులాంబ గద్వాల జిల్లా బిజెపి అధ్యక్షుడు రామచంద్రారెడ్డి ,రాజగోపాల్ , అధికార ప్రతినిధి మల్లయ్య, వినీత్, శరత్ బాబు, తదితరులు ఉన్నారు.