calender_icon.png 6 November, 2024 | 7:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట తప్పింది

03-11-2024 12:50:56 PM

2 లక్షల రుణమాఫీ కాలేదు 500 బోనస్ వెంటనే రైతులకు ఇవ్వాలి

నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్

కామారెడ్డి, (నిజామాబాద్), (విజయ క్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా మాట తప్పిందని నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ అన్నారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అధికారం చేపట్టాలని రెండు లక్షల రుణమాఫీ ప్రతి ఒక్క రైతుకు చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి 10 నెలలు గడుస్తున్న ఎందుకు హామీ లను నెరవేర్చలేదని ప్రశ్నించారు.

జిల్లాలో 468 దాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పి ఇప్పటివరకు 40 కేంద్రాల లో కొబ్బరికాయలు కొట్టి అక్కడ కూడా పూర్తిస్థాయిలో ధాన్యాన్ని కొనుగోలు ప్రారంభించలేదని ఆరోపించారు. తక్షణమే మిగిలిన వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన అక్కడ దాన్యం మాత్రం కొనడం లేదన్నారు. అకాల వర్షాల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల ఇబ్బందులు కనిపించడం లే దా అని ప్రశ్నించారు. రైతులకు సన్నధాన్యానికి 500 బోనస్ క్వింటాలకు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చి ఆదుకోవాలని కోరారు. ఈ సమావేశంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే  ధన్ పాల్ సూర్యనారాయణ, మేడపాటి ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.