calender_icon.png 11 January, 2025 | 3:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘ఎంసీజీ’ని సందర్శించిన ఎంపీ చామల

10-01-2025 11:43:41 PM

యాదాద్రి భువనగిరి (విజయక్రాంతి): ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి శుక్రవారం మెల్‌బోర్న్ క్రికెట్ గౌండ్ (ఎంసీజీ)ని సందర్శించారు. ఆస్ట్రేలియాలో ఔత్సాహిక క్రికెటర్లకు ఇస్తున్న శిక్షణ, ఎంపిక ప్రక్రియ తదితర అంశాలపై విక్టోరియా ప్రీమియం క్రికెట్ జనరల్ మేనేజర్ లియం మార్ఫీతో ఎంపీ చర్చించారు. ఎంసీజీ చాలా బాగుందని, నిర్వహణ అద్భుతంగా ఉందని ఆయన కితాబిచ్చారు. ఈ సందర్భంగా విక్టోరియా ప్రీమియం క్రికెట్ జనరల్ మేనేజర్ లియం మార్ఫీ ఎంపీ చామలకు టీషర్ట్ బహూకరించారు.