calender_icon.png 22 December, 2024 | 5:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలోనూ బాధ్యతగా ఉండాలి

22-12-2024 12:08:32 PM

అమరావతి,(విజయక్రాంతి): ప్రముఖ సినీహీరో అల్లు అర్జున్ మీడియా సమావేశంపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. అల్లు అర్జున్ మానవత్వం మరచినట్లు ఉన్నారని, ఎవరో రాసిన నోట్ ను ఆయన ప్రెస్ మీట్ లో చదివారని ఎంపీ చామల వ్యాఖ్యానించారు. నోట్ లో ఉన్నది అల్లు అర్జున్ చదవడం విడ్డూరంగా ఉందని, సినీమాలోనే నటించడమే కాకుండా నిజ జీవితంలోనూ నటిస్తున్నట్లుందన్నారు. పుష్ప-2 సినిమాకు కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండగా ఉండి రేట్లు పెంచిన విషయాన్ని అల్లు అర్జున్ మార్చిపోవడం బాధేస్తుందన్నారు. అసెంబ్లీలో సీఎం వాస్తవాలు చెప్పారని, సినిమాలోనే కాదు.. నిజ జీవితంలో కూడా బాధ్యతగా ఉండాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మరోసారి గుర్తుచేశారు.