మహబూబాబాద్ (విజయక్రాంతి): మేడారం వన దేవతలను మానుకోట ఎంపి పోరిక బలరాం నాయక్ దర్శించుకున్నారు. శుక్రవారం ఎంపి రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి సీతక్క, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో కలసి దర్శించుకోవడం జరిగింది. అనంతరం ఐటీడీఎ క్యాంప్ కార్యాలయంలో జాతర రివ్యూ మీటింగ్ లో పాల్గొని చిన్న జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అప్రమత్తం కావాలిని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ ఎస్పీ ఐటీడీఎ పీవో తదితరులు పాల్గొన్నారు.