calender_icon.png 6 March, 2025 | 5:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న ఎంపీ బలరాం నాయక్

06-03-2025 01:23:14 AM

భద్రాచలం, మార్చ్ 5 (విజయ క్రాంతి) : భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని బుధవారం ఉదయం మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు పోరిక బలరాం నాయక్ దర్శించుకుని సీతారామచంద్రస్వామి వారికి  ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా దేవాలయం అర్చకులు ఆలయ విశిష్టతను ఎంపీ కి తెలియజేశారు.

అనంతరం లక్ష్మీ తాయారు అమ్మవారి సన్నిధిలో అమ్మవారి దర్శనం అనంతరం వేద పండితులు అర్చకులు  వేద ఆశీర్వచనం నిర్వహించి స్వామివారి కండువా ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా దేవాలయం అభివృద్ధి గురించి దేవస్థానం ఈవో ఎల్ రమాదేవితో చర్చించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రాము తో పాటు పలువురు పాల్గొన్నారు.