calender_icon.png 27 November, 2024 | 8:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంభాల్ కేసులో ఏ1గా ఎంపీ

27-11-2024 02:24:49 AM

ఎఫ్‌ఐఆర్‌లో రెహమాన్‌తో పాటు మరో ఆరుగురి పేర్లు

లక్నో, నవంబర్ 26: ఉత్తప్రదేశ్‌లోని సంభాల్‌లో ఆదివారం చోటుచేసుకున్న హింసాకాండ వెనుక సమాజ్‌వాదీ ఎంపీ జియావుర్ రెహమాన్ పాత్ర ఉందని, ఈ కేసులో ఆయనే ఏ1 నిందితుడని పోలీసులు మంగళవారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అలాగే ఏ2 నిందితుడిగా సంభాల్ ఎమ్మెల్యే ఇక్బాల్ మహమూద్ కుమారుడు సుహైల్ ఇక్బాల్‌ను చేర్చారు. ఎఫ్‌ఐఆర్‌లో మరో ఆరుగురు వ్యక్తుల పేర్లను కూడా చేర్చగా, పోలీసులు వివరాలపై స్పష్టత ఇవ్వలేదు.

హింసాకాండకు రెండు రోజుల ముందు ఎంపీ సంభాల్‌లో పర్యటించారని, సర్వే చేపట్టాల్సి ఉన్న జామా మసీద్‌ను సందర్శించా రని పోలీసులు పేర్కొన్నారు. సర్వేను అడ్డుకోవాలనే ఉద్దేశంతో స్థానికులను రెచ్చగొట్టా రని, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఎంపీ కుట్ర పన్నారని ఆరోపించారు. ఎంపీ వెంట సుహైల్ ఇక్బాల్ కూడా ఉన్నాడని చెప్పారు.