calender_icon.png 16 January, 2025 | 5:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అజ్ఞానంతోనే ఎంపీ అర్వింద్ వ్యాఖ్యలు

16-01-2025 02:46:10 AM

* పసుపుబోర్డు కోసం నేను కేంద్రానికి లేఖలు రాశా 

* వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 

హైదరాబాద్, జనవరి 15 (విజయక్రాంతి ): నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటుపై ఎంపీ అర్వింద్ కేవలం అజ్ఞానంతో మాట్లాడుతున్నారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తు  నాగేశ్వరరావు ఎద్దేవా చేశారు. పసుపు బోర్డు ఏర్పాటు కోసం తాను మూడుసార్లు కేంద్రానికి లేఖలు రాశానని పేర్కొని, వాటిని తిరిగి బుధవారం విడుదల చేశారు.

సీఎం రేవంత్‌రెడ్డి కూడా కేంద్రానికి లేఖ రాశారని గుర్తుచేశారు. పసుపు బోర్డు ఏర్పాటుకు తాము ఎలాంటి చొరవ చూపలేదని ఎంపీ వ్యాఖ్యానించడం హాస్యాస్పదమన్నారు. ఆఘమేఘాల మీద అర్ధరాత్రి పసుపు బోర్డు ప్రకటించి, తెల్లారేసరికి బోర్డును ప్రారంభించారని, అయినప్పటికీ తాము తప్పు పట్టడం లేదని స్పష్టం చేశారు. తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, ప్రతి అంశాన్ని తాము రాజకీయం చేయదలుచుకోలేదని తేల్చిచెప్పారు.