నిజామాబాద్, (విజయక్రాంతి): నిజామాబాద్ నగరంలోని బైపాస్ రోడ్డులో ఖేలో ఇండియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సౌత్ జోన్ మహిళల సైక్లింగ్ లీగ్ పోటీలను జెండా ఊపి ప్రారంభించాను. ఖేలో ఇండియా ద్వారా నిజామాబాద్ లాంటి ద్వితీయ శ్రేణిపట్టణాల్లో ఇలాంటి పోటీలు నిర్వహిస్తున్నందుకు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాతోపాటు అర్బన్ శాసనసభ్యులు శ్రీ ధన్ పాల్ సూర్యనారాయణ, అసిస్టెంట్ డైరెక్టర్ స్పోర్ట్స్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ కుమారి నిషా విద్యార్థి, జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ ఈగ సంజీవరెడ్డి, నిజామాబాద్ జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ అధ్యక్షులు కృపాకర్ రెడ్డి, తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి విజయకాంతరావు, వందలాదిమంది క్రీడాకారిణులు పాల్గొన్నారు.