calender_icon.png 24 January, 2025 | 1:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్రమంత్రిని కలిసిన ఎంపీ అర్వింద్, జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్

23-01-2025 09:05:21 PM

నిజామాబాద్ (విజయక్రాంతి): ఢిల్లీలోని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్(Union Commerce Minister Piyush Goyal) ను ఆయన కార్యాలయంలో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి(MP Arvind Dharmapuri)తో పాటు జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి(National Turmeric Board Chairman Palle Gangareddy) మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జాతీయ పసుపు బోర్డు చైర్మన్ గా ఎన్నికైన పల్లె గంగారెడ్డికి కేంద్రమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. దశాబ్దాల కల సాకారమైనందున పసుపు రైతుల సంక్షేమానికి తోడ్పడాలని మంత్రి సూచించారు. అంతేగాకుండా పసుపు ఎగుమతులు, మార్కెటింగ్ తదితర అంశాలపై ఆయన చర్చించారు. అతిత్వరగా పసుపు బోర్డు కార్యక్రమాలను మొదలుపెడతామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. పల్లె గంగారెడ్డి తనను జాతీయ పసుపు బోర్డు చైర్మన్ గా నియమించడం పట్ల మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో వారితో పాటు జగిత్యాల జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మోరెపల్లి సత్యనారాయణ కూడా మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.