నిజామాబాద్,(విజయక్రాంతి): నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ ఆదివారం నిజామాబాద్ లో బీజేపీ క్రియాశీల సభ్యత్వాన్ని స్వీకరించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి చేతుల మీదుగా ఎంపీ అరవింద్ సభ్యత్వ రసీదును అందుకున్నారు. బీజేపీ సభ్యత్వం ప్రతి ఒక్క కార్యకర్త క్రియేషీల సభ్యత్వాన్ని పొందే విధంగా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్, మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి, పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.