- ఆదిలాబాద్‌లో ఎయిర్‌ఫోర్స్ స్టేషన్, సైనిక్ పాఠశాల ఏర్పాటుకు వినతి
ఆదిలాబాద్, జూన్ 29 (విజయక్రాంతి): కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్‌శంకర్ శనివారం ఢిల్లీలో కలిశారు. ఆదిలాబాద్‌లో ఎయిర్‌ఫోర్స్ స్టేషన్, సైనిక్ పాఠశాల ఏర్పాటు చేయాలని వినతిపత్రాన్ని అందజేశారు. కేంద్ర ప్రభుతం 2014లోనే ఆదిలాబాద్‌లో ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలను ప్రారంభించినట్లు గుర్తు చేశారు. జిల్లా యంత్రాం గం అవసరమైన భూమిని అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు నివేదికను పంపారని తెలిపారు.
ప్రస్తుతం ఉన్న విమానాశ్రయ స్థలానికి అదనంగా 1592.25 ఎకరాల భూమిని గుర్తించారన్నారు. ఆదిలాబాద్ వెనుకబడిన, మారుమూల జిల్లా అయినందున ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌ను ఏర్పాటు చేస్తే ఎంతోకొంత ప్రయోజనం పొందుతుందని విన్నవించారు. ఆదిలాబాద్ జిల్లాలో ప్రధానంగా గిరిజనులు అధికంగా ఉన్నారని, విద్య, అభివృద్ధి పరంగా వెనుకబడిన ప్రాంతంగా గుర్తింపు పొందిందన్నారు. విద్యాపరమైన సదుపాయాలు కల్పించి, సైనిక్ స్కూల్‌ను ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు.