calender_icon.png 25 February, 2025 | 7:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెరువుగట్టులో ఎంపీ, ఎమ్మెల్యే పూజలు

25-02-2025 01:13:32 AM

నల్లగొండ, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి): నార్కట్పల్లి మండలంలోని చెర్వుగట్టు  పార్వతీ జడ ల రామలింగేశ్వరస్వామి ఆలయంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సోమవారం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శివరాత్రి సంద ర్భంగా ఆలయంలో చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు.

భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పా ట్లు చేయాలని ఈఓకి సూచించారు. రద్దీ నియంత్రణ, భద్రత, తాగునీటి సరఫరా, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టిపెట్టాలని చెప్పారు. ఆలయాభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అంతకుముం దు ఆలయ ప్రధాన అర్చకుడు, దేవాదాయశాఖ అధికారులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు.