calender_icon.png 3 March, 2025 | 12:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రంపచోడవరం, మారేడుమిల్లి ఫారెస్ట్‌లో ‘మోగ్లీ’ పోరాటాలు

02-03-2025 09:02:17 PM

తన తొలి చిత్రం ‘కలర్ ఫోటో’తో జాతీయ అవార్డు గెలుచుకున్న యంగెస్ట్ డైరెక్టర్ సందీప్‌రాజ్, తన అప్ కమింగ్ ప్రాజెక్ట్ ‘మోగ్లీ 2025’తో మరో ఎమోషనల్ పవర్‌ఫుల్ నెరేటివ్‌ని తెరపైకి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు. తొలి చిత్రం ‘బబుల్‌గమ్’లో ఇంటెన్స్ యాక్షన్‌కు ప్రశంసలు అందుకున్న రోషన్ కనకాల ‘మోగ్లీ 2025’లో తన వెర్సటాలిటీ ప్రజెంట్ చేసే పవర్‌ఫుల్ పాత్రను పోషిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విజనరీ ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్, కృతిప్రసాద్ నిర్మిస్తున్న మోగ్లీ 2025 అద్భుతమైన ఫారెస్ట్ నేపథ్యంలో జరిగే ప్రేమకథ. సాక్షి సాగర్ మడోల్కర్ కథానాయికగా పరిచయం అవుతోంది. 

మోగ్లీ 2025 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా మేకర్స్ 20 రోజుల క్రూషియల్ షెడ్యూల్‌ని పూర్తిచేశారు. ఈ షెడ్యూల్‌లో రంపచోడవరం, మారేడుమిల్లి ఫారెస్ట్‌లో రెండు మ్యాసీవ్ యాక్షన్ బ్లాక్‌లను షూట్ చేశారు. సినిమాలో ఈ యాక్షన్ సీక్వెన్స్‌లు హైలెట్‌గా ఉండబోతున్నాయి. ఈ మూవీకి ట్యాలెంటెడ్ టెక్నిషియన్స్ పనిచేస్తున్నారు. రామ మారుతి ఎం సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, కాలభైరవ సంగీతం సమకూరస్తున్నారు. కోదాటి పవన్ కళ్యాణ్ ఎడిటింగ్, కిరణ్ మామిడి ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌ను పర్యవేక్షిస్తున్నారు. నటరాజ్ మాదిగొండ యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ చేస్తున్నారు. రామ మారుతి ఎం. రాధాకృష్ణరెడ్డి సహ రచయితలుగా ఉన్నారు. ఈ సంవత్సరం చివర్లో విడుదల కానుందీ చిత్రం.