calender_icon.png 1 April, 2025 | 6:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వందశాతం లక్ష్యంతో ముందుకు

26-03-2025 01:24:17 AM

 తుర్కయంజాల్ మున్సిపాలిటీలో ముమ్మరంగా ట్యాక్స్ వసూళ్లు

 రూ.16.29 కోట్ల డిమాండ్.. ఇప్పటివరకు రూ.11.23 కోట్లు

 100శాతం ట్యాక్స్‌లు వసూళ్లు చేస్తం: కమిషనర్ అమరేందర్‌రెడ్డి

అబ్దుల్లాపూర్‌మెట్, మార్చి 25: అభివృద్ధిలో ముందుండాలంటే పన్నులు చెల్లించాల్సిందే. నగరాభివృద్ధికి నిధులు సమకూర్చేందుకు ఆస్తిపన్నే కీలకం. ఇందు కోసం తుర్కయంజాల్ మున్సిపల్ అధికారులు ఆస్తిపన్ను పూర్తి స్థాయిలో వసూలు చేసేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. 20242025 సంవత్సరానికి సంబంధించిన ఇంటి పన్నులు, ట్రెడ్ లైసెన్స్ లు ఇతర పనుల వసూళ్లకు మరో ఆరు రోజులు మాత్రమే మిగిలింది. ఈ ఆర్థిక సంవత్సరం 31 తేదీలోగా 100శాతం పన్నులు వసూలు చేసేందుకు తుర్కయంజాల్ అధికారులు దృష్టి సారించారు. మున్సిపల్‌లో 20242025 ఆర్థిక సంవత్సరంలో రూ. 16.29 కోట్లు డిమాండ్ ఉండగా.. ఇప్పటి వరకు మున్సిపాలిటీలో రూ. 11.23 కోట్లు ఇంటి పన్నులు, తదితర ట్యాక్సల్ వసూళ్లు చేశారు. ప్రస్తుతం మున్సిపాలిటీలో 70శాతం పన్నులు వసూళ్లు చేశారు.

100శాతం వసూళ్లు చేస్తాం

తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలో ఇప్పటి వరకు 70శాతం ఇంటిపన్ను ఇతర పన్నులు వసూలు అయ్యాయి. మిగిలిన పన్నులు ఈ నెలాఖరు వరకు బిల్ కలెక్టర్లు, వార్డు ఆఫీసర్లతో నిరంతరం పర్యవేక్షణ, సమీక్షాలు నిర్వహించి తప్పకుండా 100శాతం పూర్తి చేయిస్తాం.

 -అమరేందర్‌రెడ్డి, కమిషనర్ తుర్కయంజాల్ మున్సిపాలిటీ