23-03-2025 12:00:00 AM
బి.మహేశ్ కుమార్‌గౌడ్ :
సంక్షేమానికి మారుపేరుగా నిలిచే కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థికంగా ఎన్ని అవాంతరాలు ఎదురైనా పేదల సంక్షేమానికి, అభివృద్ధికి వెనుకంజ వేయదని బడ్జెట్ సందర్భంగా మరోసారి రుజువైంది. 202526 బడ్జెట్ పారదర్శకంగా ఉండడమే కాకుండా రాష్ట్రంలోని అన్ని వర్గాల్లో అందరికీ ఆమోదయోగ్యంగా ఉంది.
పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ బడ్జెట్ ప్రవేశపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం తమది పేదల పక్షపాత ప్రభుత్వమని మరోసారి నిరూపించుకుంది. మహిళా సాధికారత, రైతులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమంతో పాటు విద్య, ఆరోగ్య, పరిశ్రమల ప్రగతి కాంగ్రెస్‌తోనే సాధ్యమని తెలంగాణ బడ్జెట్ మరోసారి రుజువు చేసింది.
రాష్ట్రం ఏర్పడేనాటికి మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణ పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఆర్థికంగా దివాలా తీసి ఖజానా ఖాళీ అయినా పేదల సంక్షేమంలో కాంగ్రె స్ ప్రభుత్వం రాజీ పడకుండా బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం అభినందనీయం. ఎన్నికల ముందు అభయహస్తం మానిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటీ నెరవేరుస్తున్న ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో కూడా ప్రభుత్వ పథకాలకు, ఆరు గ్యారెంటీలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించి తమది మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని నిరూపించుకుంది.
తెలంగాణ ప్రభుత్వం 2025--26 ఆర్థిక సంవత్సరానికి మొత్తం రూ.3,04,965 కోట్ల వ్యయంతో భారీ బడ్జెట్ ప్రవేశపెట్టింది. రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లు కాగా, మూలధన వ్యయం రూ. 36,504 కోట్లు. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనకు సమపాళ్లలో ప్రాధాన్యతిచ్చేలా బడ్జెట్ ఉంది. 2024-25లో రూ. 2.91 లక్షల కోట్ల వ్యయంతో బడ్జెట్ ప్రవేశ పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ పాలన సాగించడంతో ఆ ఫలాలు ఇప్పుడు అందుతున్నాయి.
దేశ వృద్ధి రేటుకన్నా అధికం
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పరిశీలిస్తే వృద్ధి రేటు 10.1శాతం ఇది దేశ వృద్ధిరేటు 9.9 శాతం కంటే అధికం. తలసరి ఆదాయం లో కూడా దేశవృద్ధి రేటు 8.8 శాతం ఉంటే తెలంగాణ వృద్ధి రేటు 9.6 శాతంగా నమోద కావడం గర్వకారణం. జాతీయ సంస్థ పీఎల్‌ఎఫ్‌ఎస్ నివేదిక ప్రకారం తెలంగాణలో 2023 జులై -- సెప్టెంబర్‌లో నిరుద్యోగ రేటు 22.9 శాతంగా ఉండగా 2024 జులై--సెప్టెంబర్ నాటికి 18.1 శాతానికి తగ్గడం కాంగ్రెస్ సాధించిన విజయం.
ఆర్థిక క్రమశిక్షణ, విశ్వాసం, నమ్మకమే పెట్టుబడిగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మరోసారి ప్రజాసంక్షేమ బడ్జెట్ ప్రవేశపెట్టి తమది ప్రజా ప్రభుత్వమని నిరూపించారు.
ఆరు గ్యారెంటీలకు ప్రాధాన్యత
ఆరు నూరైనా ఆరు గ్యారెంటీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం గతంతో పాటు ప్రస్తుత బడ్జెట్‌లో కూడా అధిక ప్రాధాన్యతిచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పించడంతో ఇప్పటి వర కు 149.63 కోట్ల మంది మహిళలు వినియోగించుకొని రూ.5005.95కోట్లు ఆదా చేసుకున్నారు.
గృహజ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌తో 50 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతోంది. గ్యాస్ సిలిండర్‌పై రూ.500 సబ్సిడీతో 43 లక్షల కుటుంబాలకు ప్రయోజనం కలుగుతోంది. మహిళా సంఘాలతో 600 బస్సు లు కొనుగోలు చేయించి ఆర్టీసీకి అద్దెకివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మహిళల పేరిటనే 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నారు.
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అసమర్థత వల్ల అసంపూర్తిగా మిగిలిన 34,545 డబుల్ బెడ్ రూం ఇళ్ల పూర్తి కోసం బడ్జెట్‌లో రూ.305.03 కోట్లు ప్రతిపాదించారు. మహిళల పేరిట 40 లక్ష ల నూతన రేషన్ కార్డులను జారీ చేసే ప్రక్రి య చేపట్టిన ప్రభుత్వం పౌర సరఫరాల శాఖకు 5,734 కోట్లు కేటాయించింది.
మహిళా శిశు సంక్షేమానికి తోడ్పాటు అం దించేలా రూ.2862 కోట్లు కేటాయించా రు. ఆరోగ్యశ్రీ పథకాన్ని రూ.5లక్షల నుండి రూ.10 లక్షలకు పెంచడంతో 90 లక్షలకు పైగా నిరుపేద కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది. ఆరోగ్య రంగాన్ని మరింత బలో పేతం చేసేలా వైద్య ఆరోగ్య శాఖకు 12,393 కోట్లు కేటాయించారు.
సమాజానికి వెన్నెముకలైన అన్నదాతలను ఆదుకోవాలనే లక్ష్యంతో ప్రభుత్వం వ్యవసాయ శాఖకు 24,439 కోట్లు కేటాయించింది. ఇప్పటికే రైతు రుణమాఫీ కింద ఒకేసారి 25.35 లక్షల మంది రైతులకు రూ.20,616.89 కోట్ల రుణమాఫీ చేసి రికార్డు సృష్టించింది.
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతు బంధు కింద ఏడాదికి రూ. 10 వేలు ఇవ్వగా, కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా కింద రూ.12 వేలు ఇస్తూ ఇప్పటికే 52 లక్షల మందికిపైగా రైతుల కోసం రూ. 4 వేల కోట్లకు పైగా చెల్లించింది. ఈ బడ్జెట్‌లో రైతు భరోసా కోసం రూ.18 వేల కోట్లు కేటాయించి అన్నదాతల్లో భరోసా కల్పించింది.
దేశ చరిత్రలోనే తొలిసారిగా రైతు కూలీలకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదికి రూ.12 వేలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద అందజేస్తోంది. రాష్ట్రంలో సన్న ధాన్యం సాగును ప్రోత్సహిస్తూ రైతులకు బోనస్ కింద రూ.1,206.44 కోట్లు చెల్లించడంతో సన్నవరి సాగు 25 లక్షల ఎకరాల నుంచి 40 లక్షల ఎకరాలకు పెరిగింది.
పెండింగ్ ప్రాజెక్టులకు పెద్దపీట
నీటి పారుదల శాఖకు రూ.23,373 కోట్లు కేటాయించిన ప్రభుత్వం గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన ప్రాజె క్టులను ఏ’, బీ’ లుగా విభజించి ప్రాధాన్య త క్రమంలో పూర్తి చేయాలని, ఎన్ని వ్య యప్రయాసలు ఎదురైనా చివరి ఆయకట్టుకు సాగునీటి అందించాలనే దృఢ నిశ్చయంతో చర్యలు తీసుకుంటోంది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ధరణి పేరుతో జరిగిన అరాచకాలకు చెక్ పెట్టేలా ‘భూ భారతి’ని తీసుకొచ్చిన కాంగ్రెస్ దీన్ని పకడ్బందీగా అమలు చేసే దిశగా 10,954 గ్రామ స్థాయి అధికారుల పోస్టులను మం జూరు చేసింది.
విద్యా రంగానికి బడ్జెట్‌లో రూ.23,108 కోట్లు కేటాయించారు. విద్య నిరుపేదలందరికీ చేరువ కావాలనే లక్ష్యంతో 58 యం గ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను ప్రారంభించేందుకు బడ్జెట్‌లో రూ. 11,600 కోట్లు కేటాయించడం స్వాగతించాల్సిన అంశం. కోఠి మహిళా విశ్వవి ద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు పెట్టి ఆమెను గౌరవించుకున్న ప్రభుత్వం విశ్వవిద్యాలయానికి రూ.500 కోట్లు కేటా యించింది.
తెలంగాణ ఉద్యమంలో కీలకాంశమైన ఉద్యోగాల అంశానికి పెద్ద పీట వేస్తూ ఇప్పటికే 57 వేల ఉద్యోగ నియామకాలు భర్తీ చేయడమే కాకుండా ప్రస్తుత బడ్జెట్‌లో కార్మిక ఉపాధి శాఖకు రూ.900 కోట్లు కేటాయించారు. దావోస్‌లో 1.78 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించి రికార్డు సృష్టించిన తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని మరింత ప్రోత్సాహించేలా పరిశ్రమలశాఖకు 3,527 కోట్లు, ఐటీ శాఖకు రూ.774 కోట్లు కేటాయించిం ది.
గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు ఇతర జిల్లాల్లో కూడా ఐటీ, ఫార్మా రంగాలు పెట్టుబడులు పెట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖకు రూ.23,373 కోట్లు, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కు రూ.31,605 కోట్లు కేటాయించింది.
బడుగు బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తూ ఇప్పటికే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ చారిత్రాత్మక బిల్లులను ఆమోదించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీల సంక్షేమానికి రూ. 40, 234 కోట్లు, ఎస్టీల సంక్షేమానికి 17.169 కోటు,్ల బీసీల సంక్షేమానికి 11,405 కోట్లు, మైనార్టీ సంక్షేమానికి రూ.3591 కోట్లు కేటాయించింది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు పక్కదారి పట్టిన నేపథ్యంలో ఈ సారి అలాంటివి పునరావృతం కాకుండా కాం గ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది.
సంక్షేమానికి మారు పేరుగా నిలిచే కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థికంగా ఎన్ని అవాంతరాలు ఎదురైనా పేదల సంక్షేమానికి, అభివృద్ధికి వెనుకంజ వేయదని బడ్జెట్ సందర్భంగా మరోసారి రుజువైంది. సంక్షేమంతో పాటు అభివృద్ధి, సుపరిపాలన అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్ జవాబుదా రీగా, పారదర్శకంగా ఉండడమే కాకుండా రాష్ట్రంలోని అన్ని వర్గాల్లో నమ్మకంతో పా టు భరోసాను కలిగిస్తూ అందరికీ ఆమోదయోగ్యంగా ఉంది.
వ్యాసకర్త: టీపీసీసీ అధ్యక్షుడు