calender_icon.png 2 April, 2025 | 6:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కదులుతున్న డొంక

27-03-2025 01:16:15 AM

  • నకిలీ పాస్ పుస్తకాల వ్యవహారంపై విచారణకు ఆదేశించిన కలెక్టర్
  • ఈ వ్యవహారంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగి కోట్లకు పడ గలెత్తిన వైనం
  • నకిలీ పాస్ పుస్తకాలు పొందింది మాజీ ప్రజాప్రతినిధు లే 
  • ఆందోళన చెందుతున్న నకిలీ పాస్ పుస్తకాలు పొందిన రైతులు

కామారెడ్డి మార్చి 26 (విజయ క్రాంతి) నకిలీ పాస్ పుస్తకాలు పొంది బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడమే కాకుండా ప్రభుత్వ పథకాలను పొందిన వ్యవహారంపై డొంక కదులుతుంది. లక్షల రూపాయలు పెట్టి 273 ఎకరాల భూములకు నకిలీ పాస్ పుస్తకాలు పొందిన కొందరు మాజీ ప్రజా ప్రతినిధులు వారి అనుచరులు మరికొందరు బినామీల పేరుతో ధరణి పాస్ పుస్తకాలను పొందారు.

భూమి లేకుండా పాస్ పుస్తకం

భూమి లేకున్నా పక్క సర్వేనెంబర్ బై నంబర్లు వేసి పాస్ పుస్తకాలు పొందిన కొందరు నకిలీ రైతులు కోట్ల రూపాయల రుణాలను జిల్లా వ్యాప్తంగా పొందడమే కాకుండా ప్రభుత్వ పథకాలైన రైతు బంధు ఇన్సూరెన్స్ వంటి పథకాలను పొందారు. వెనుకబడిన మారుమూల మండల కేంద్రాలను ఎంచుకొని నకిలీ పాస్ పుస్తకాల వ్యవహారాన్ని చేపట్టారు.

ఇటీవల కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో స్థలం లేకున్నా అదే సర్వే నెంబర్ బై నెంబర్లతో 273 ఎకరాల స్థలాలకు సంబంధించిన పాసుపుస్తకాలు పొందిన కొందరు రైతుల వ్యవహారం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. జుక్కల్ తాసిల్దార్ కార్యాలయంలో పనిచేసిన అవుట్సోర్సింగ్ ఉద్యోగి మరో రెవెన్యూ ఉద్యోగి తో పాటు తహసిల్దార్ ఒక్కొక్క పాస్ పుస్తకానికి లక్షల్లో బేరమాడి డబ్బులు దండుకున్నారు.

గత తొమ్మిది సంవత్సరాలుగా ఈ దందాను నిర్వహించారు. ఆర్ టి ఐ ద్వారా సమాచారం సేకరించగా నకిలీ పుస్తకాల బాగోతం వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని కామారెడ్డి ఎల్లారెడ్డి బాన్సువాడ జుక్కల్ నియోజకవ వర్గాలలోని సబ్ డివిజన్ రెవెన్యూ కార్యాలయాల పరిధిలోని మండలాలు గ్రామాల్లో అటవీ ప్రాంత భూముల్లో మారుమూల గ్రామాలు మండలాల లో ఈ నకిలీ పాస్ పుస్తకాలు పొంది బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకోవడమే కాకుండా ప్రభుత్వ పథకాల లబ్ధి పొందారు.

నకిలీ సర్వేనెంబర్ ల ద్వారా 273ఎకరాల భూమికి సంబంధించి పాసుపుస్తకాలు పొందిన జుక్కల్ రెవెన్యూ కార్యాలయం నుంచి పొందిన వ్యవహారంపై విజయ క్రాంతి దినపత్రిక వెలుగులోకి తేవడంతో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగు వన్ స్పందించి విచారణకు ఆదేశించారు.

విచారణకు ఆదేశించిన కలెక్టర్

 కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, ఆర్డిఓ లను నకిలీ పాస్ పుస్తకాల వ్యవహారంపై ప్రభుత్వ పథకాల లబ్ధి పొందిన వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి బాధ్యులైన వారిని గుర్తించి వారి వివరాలను కూడా నివేదించాలని ఆదేశించారు. దీంతో సబ్ డివిజన్ కార్యాలయాలకు ఆయా మండలాల తాసిల్దారులను, రెవెన్యూ ఇన్స్పెక్టర్ లను పిలిచి నకిలీ పాస్ పుస్తకాల వ్యవహారాలను వివరాలను ఆ అందించాలని సూచించారు.

జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారని త్వరగా విచారణ చేసి నివేదికలు ఇవ్వాలని ఆర్డీవోలు సంబంధిత మండలాల తాసిల్దారులను ఆదేశించారు. ఈ సమావేశంలో తాసిల్దార్లు రెవిన్యూ ఇన్స్పెక్టర్ లు రాము ఆ సమయంలో లేమని గతంలోని అధికారులు చేసిన తప్పిదమని రెవెన్యూ డివిజనల్ అధికారులకు చెప్పినట్లు సమాచారం.

ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు రెవెన్యూ ఉద్యోగులు కుమ్మక్కై సాగించిన దందా

అప్పట్లో రెవిన్యూ కార్యాలయాల్లో ధరణి కోసం పాస్ పుస్తకాల వివరాలు సర్వే నెంబర్ల వివరాలను అప్పటి వీఆర్వోలు వీఆర్‌ఏలు అవుట్సోర్సింగ్ ఆపరేటర్లు అప్పటి తాసిల్దార్లు కుమ్మక్కై నకిలీ పాసుపుస్తకాలు ఇచ్చారని ఆయా మండలాల తాసిల్దారులు, ఆర్డీవోలకు చెప్పినట్లు తెలుస్తోంది. 

నకిలీ పాస్ పుస్తకాల డొంకను జిల్లా కలెక్టర్ ఆదేశాల తో.... స్థానిక తహసిల్దారులు రెవిన్యూ ఇన్స్పెక్టర్లు  క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదికలను తయారుచేసి కలెక్టర్ ఆశిష్ సంగు వానుకు నివేదించనున్నారు. 

బ్యాంకుల నుంచి రుణాలపై ఆరా

నకిలీ పాస్ పుస్తకాలు పొందడమే కాకుండా బ్యాంకు రుణాలు, ప్రభుత్వం నుంచి రైతుబంధు, ఇతర పథకాలను ఎవరెవరు ఉపయోగించుకున్నారు ఆ వివరాలను సైతం సేకరించేందుకు రెవెన్యూ అధికారులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. నకిలీ పాస్ పుస్తకాలు పొందిన నకిలీ రైతులు అప్పటి ప్రజాప్రతినిధులు ఆందోళన చెందుతున్నారు.

ప్రభుత్వానికి నివేదిస్తే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయోనని నకిలీ పాస్ పుస్తకాలు పొందిన వారు ఆందోళన చెందుతున్నారు. బ్యాంకు రుణాలు ప్రభుత్వం మాఫీ చేయడంతో ఆ రుణాలు మళ్లీ చెల్లించాలా రైతుబంధు తీసుకున్న డబ్బులను చెల్లించాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు.