calender_icon.png 29 April, 2025 | 5:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చాలా బాగుందనిపించేలా సినిమాలు తీయాలి

29-04-2025 12:00:00 AM

శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న తాజాచిత్రం ‘సింగిల్’. ఈ చిత్రంలో కేతికాశర్మ, ఇవానా కథానాయికలుగా నటించారు. కార్తీక్ రాజు దర్శకత్వంలో గీతా ఆర్ట్స్, కళ్యా ఫిల్మ్స్ పతాకాలపై విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మిస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ ఈవెంట్‌లో చిత్ర సమర్పకుడు అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ‘డైరెక్టర్ కార్తీక్ ఈ కథ చెప్తున్న రెండు గంటల పాటు నేను కిందపడి పగలబడి నవ్వుతూనే ఉన్నా.

అంత అద్భుతంగా చెప్పారు’ అన్నారు. హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ.. ‘ఇంటిల్లిపాదినీ కడుపుబ్బా నవ్వించాలనే ప్రయత్నంతో ఈ సినిమా చేశాం. కిషోర్, కేతిక, ఇవాన.. ఇలా మంచి టీమ్ భాగమైన తర్వాత ఇరగబడి నవ్వించడం కాస్త కసిగా నవ్వించేదాకా వెళ్లింది’ అని చెప్పారు. హీరోయిన్ కేతిక మాట్లాడుతూ.. ‘విష్ణు, వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్ అద్భుతం. ప్రేక్షకులు పడీపడి నవ్వుతారు’ అన్నారు. ‘ఈ సినిమా ఫన్ రైడ్. చాలా ఎంజాయ్ చేస్తూ సినిమా చేశాను’ అని మరో హీరోయిన్ ఇవానా చెప్పారు. డైరెక్టర్ కార్తీక్ రాజు మాట్లాడుతూ.. ‘అల్లు అరవింద్‌తో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా. శ్రీవిష్ణుతో కలిసి పనిచేయడం గర్వంగా ఉంది’ అన్నారు. చిత్ర నిర్మాత భాను మాట్లాడుతూ.. “నిప్పునకు ఉప్పు తోడైనట్టు శ్రీవిష్ణుకు వెన్నెల కిషోర్ కామెడీ యాడ్ చేశారు’ అన్నారు. ‘ఇది చాలా ఫన్ ప్రాజెక్ట్’ అని మరో నిర్మాత విద్య తెలిపారు. ప్రొడ్యూసర్ బన్నీ వాసు, నటుడు వెన్నెల కిషోర్, మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ చంద్రశేఖర్, మిగతా చిత్రబృందం పాల్గొన్నారు. 

మహిళలు అపార్థం చేసుకోవద్దు 

‘సింగిల్’ ట్రైలర్‌లో ఉన్న కాక్రోచ్ పదంపై అల్లు అరవింద్ స్పందించారు. ‘లేడీస్.. కాక్రోచ్‌లాంటి వాళ్లు అనే మాటను మహిళలు అపార్థం చేసుకోవద్దు. ఎం దుకంటే అణుబాంబు పేలినా బతకేంత శక్తిమంతమైనవి బొద్దింకలు. రెజిలియన్స్ (స్థితి స్థాపకత) గురించి చెప్పడానికే వాటితో మహిళలను పోల్చాం’ అని తెలిపారు. థియేటర్లకు వెళ్లే ప్రేక్షకుల సంఖ్య తగ్గుతోందన్న చర్చపైనా అరవింద్ స్పందించారు.

‘కొవిడ్ టైమ్ నుంచి చాలా మంది ఓటీటీకి అలవాటు పడ్డారు. ఇవన్నీ దాని కారణం గా వచ్చిన ఇబ్బందులు. అయితే, మార్పు ను ఎవరూ ఆపలేరు. సినిమా చాలా బాగుందని టాక్ వస్తే తప్ప ప్రేక్షకులు థియేటర్లకు రావడంలేదు. అలా.. చాలా బాగుందనిపించేలా సినిమాలు చేయడం దర్శకనిర్మాత బాధ్యత’ అని చెప్పారు.