calender_icon.png 19 January, 2025 | 8:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సినిమాలూ.. సిరీస్‌లు!

12-08-2024 12:00:00 AM

ఓ వైపు సినిమాలతో బిజీగా ఉంటున్న కీర్తి సురేశ్.. మరోవైపు వెబ్ సిరీస్‌లతోనూ క్షణం తీరిక లేకుండా గడుపుతోందా? అంటే, ఔననే సమాధానమే వస్తోంది. కీర్తి సురేశ్ నటించిన ‘రఘుతాత’ చిత్రం త్వరలో విడుదల కానుంది. బాలీవుడ్ కథానాయకుడు వరుణ్ ధావన్‌తో కలిసి నటించిన మరో చిత్రం ‘బేజీ జాన్’ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతేకాక ఈ అమ్మడు ఇప్పుడు ఓ వెబ్ సిరీస్‌ను పూర్తి చేసింది. ఈ సిరీస్ ఏదో కాదు.. ఐవీ శశి దర్శకత్వం వహించిన ‘ఉప్పు కప్పురంబు’. ఇందులో సుహాస్‌తో జోడీ కడుతోంది కీర్తి సురేశ్. ఈ సిరీస్ షూటింగ్ పూర్తయిన విషయాన్ని సుహాస్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. ఈ మేరకు కీర్తితోపాటు సిరీస్ యూనిట్ అందరూ కలిసి దిగిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.