ప్రదీప్ మాచిరాజు హీరోగా, దీపికా పిల్లి హీరోయిన్‌గా సినిమా రూపొందుతోంది. ఈ చిత్రానికి నితిన్, భరత్‌ల ద్వయం దర్శకత్వం వహిస్తోంది. ఈ సినిమాను మాంక్స్ మంకీస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. గురువారం ఈ సినిమా టైటిల్‌ని మేకర్స్ ప్రకటించారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తొలి సినిమా టైటిల్‌ని ప్రదీప్ చిత్రానికి పెట్టడం విశేషం. ఈ సినిమాకు ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ అనే టైటిల్‌ను ప్రకటించారు.
అలాగే ఫస్ట్ లుక్‌తో పాటు మోషన్ వీడియోను విడుదల చేశారు. సివిల్ ఇంజినీర్ పని మీద ఒక గ్రామా నికి వెళ్లడం.. అక్కడ ఓ అమ్మాయిని చూసి ప్రేమలో పడుతుంది. తరువాత కథ ఏ మలుపు తిరిగిందనేదే కథాంశం. మరోసారి ప్రదీప్ మాచిరాజు మరో ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రం లో హాస్యనటులు వెన్నెల కిషోర్, సత్య, గెటప్ శ్రీను కీలక పాత్ర లు పోషిస్తున్నారు.