calender_icon.png 19 March, 2025 | 11:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

IPL-2025 ప్రారంభానికి సినీ తారలు..

19-03-2025 08:08:35 PM

క్రికెట్ అభిమానులకు అతిపెద్ద పండుగైనా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL-2025) 18వ సీజన్ మరో మూడు రోజుల్లో ప్రారంభంకానుంది. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్(Eden Gardens) లో ప్రారంభోత్సవ వేడుకలు జరగనున్నాయి. కాగా, ఈవెంట్ ప్రారంభోత్సావానికి బాలీవుడ్ తారలు (Bollywood stars) రానునట్లు సమాచారం అందింది. బాలీవుడ్ నుంచి షారుఖ్ ఖాన్(Shahrukh Khan), సల్మాన్ ఖాన్, విక్కీ కౌశల్, సంజయ్ దత్ వచ్చే అవకాశం ఉన్నట్లు క్రికెట్ వర్గాలు తెలిపాయి. ప్రముఖ సంగీతకులు అరిజిత్ సింగ్(Arijit Singh), శ్రేయా ఘోషల్(Shreya Ghoshal) తమ సంగీతంతో అలరించనున్నారు. శ్రద్ధా కపూర్(Shraddha Kapoor), వరుణ్ ధావన్, దిశా పటానీ స్పెషల్ డ్యాన్స్ షో(Dance show) జరగనుంది.

అంతేకాకుండా, పంజాబ్ స్టార్ ర్యాపర్ కరణ్ ఔజ్లా(Star Rapper Karan Aujla) ప్రత్యేక షో చేయనున్నారు. కాగా.. మార్చి 22 నుంచి మే 25 వరకు ఐపీఎల్(IPL-2025) 18వ సీజన్ జరగనుంది. మొత్తం 74 మ్యాచులతో 65 రోజుల పాటు జరుగనున్నాయి. మార్చి 22న తొలి మ్యాచ్... డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఈడెన్ గార్డెన్స్ లో ప్రారంభం కానుంది. అలాగే మార్చి 23న రెండవ మ్యాచ్ ఉప్పల్ వేదికగా హైదరాబాద్- రాజస్థాన్ జట్ల మధ్య పోరు ఉండనుంది. ఐపీఎల్ కమిటీ విశాఖలోని అంతర్జాతీయ క్రికెట్ మైదానానికి రెండు మ్యాచ్ లను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.