calender_icon.png 5 February, 2025 | 10:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సినిమా అభిమానులు ఆలోచించాలి

08-12-2024 12:00:00 AM

సినిమా అనేది ఒక ఆటవిడుపు, వినోదం కోసమే. అందులో పాత్రధారులు నటీనటులు మాత్రమే. వారు నిజ జీవితంలో మనలానే ఉంటారు. వారూ మామూలు మనుషులే. ఎందుకు వారికి అంత ప్రాముఖ్యం ఇవ్వడం? మనం కొనే టిక్కెట్ల డబ్బుతోనే వారు కోట్లు సంపాదిస్తున్నారు. అంతే. వారిపైన విపరీత అభిమానాలు పెట్టుకుని ప్రాణాల మీదకు తెచ్చుకోవడం ఎంతవరకు సబబు? సినిమాను మొదటిరోజు చూడక పోతే ఏమన్నా నష్టమా? ‘పుష్ప 2’ విడుదలలో జరిగిన తొక్కిసలాటలో అన్యాయంగా ఒక మహిళ ప్రాణం పోయింది. దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? 

- శ్రిష్టి శేషగిరి, సికింద్రాబాద్