calender_icon.png 2 April, 2025 | 7:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీసీఐని పునరుద్ధరించే వరకు ఉద్యమాలు

29-03-2025 12:29:37 AM

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ

ఆదిలాబాద్, మార్చ్ 28 (విజయక్రాంతి) : అధికారంలోకి వస్తే ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తామని చెప్పిన బీజేపీ నేతలు అధికారంలోకి వచ్చాక హామీని విస్మరించారని సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకై సీసీఐ సాధన సమితి ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా చేపడుతున్న రిలే నిరాహార దీక్షలకు మద్దతుగా శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి వచ్చారు.

ముందుగా ఆదిలాబాద్ దీక్ష శిబిరం నుండి సిమెంట్ ఫ్యాక్టరీ వరకు సాధ న సమితి సభ్యులు, ప్రతిపక్ష పార్టీ నేతలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సీసీఐ ఫ్యాక్టరీ ప్రధాన గేటు ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జాన్ వెస్లీ మాట్లాడుతూ ఆదిలాబాద్ ప్రజలు బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలను గెలిపించినప్పటికీ ఫ్యాక్టరీని పునరుద్ధరించకపోగా, ఉన్న ఫ్యాక్టరీని తుక్కు కింద అమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నిందన్నారు.

ఇప్పటికైనా ఫ్యాక్టరీని పునరుద్ధరిం చాలని లేనిపక్షంలో ఆందోళనలు ఉధృ తం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో సీసీఐ సాధన సమితి కన్వీనర్ మల్లేష్, కో కన్వీనర్ నారాయణ, బండి దత్తత్రి, ముడుపు ప్రభాకర్ రెడ్డి, బండారు రవి కుమా ర్,  సభ్యులతో పాటు ఆయా పార్టీల నేతలు, ప్రజా సంఘాలు నాయకులు పాల్గొన్నారు.