ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ
కామారెడ్డి, నవంబర్ 3 (విజయక్రాంతి): రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాదిగ రిజర్వేషన్ బిల్లును అమలు చేయకుంటే పెద్ద ఎత్తున దిగ్బంధాలు, ఉద్యమాలు చేపడుతామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష ్ణమాదిగ హెచ్చరించారు.
ఆదివారం కామారెడ్డిలో నిర్వహించిన ధర్మ యు ద్ధ మహాసభలో ఆయన మాట్లాడారు. 59 కులాలకు వాటా ఇచ్చి అంబేద్కర్ కలను నిజం చేయాలని మందకృష్ణ పిలుపునిచ్చా రు. రేవంత్రెడ్డి మాదిగలకు హమీ ఇచ్చి ఇప్పుడు మాట తప్పుతున్నారన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీస్ కామారెడ్డి ఇన్చార్జి మైలారపు బాలు, మాజీ రాష్ట్ర కార్యదర్శి బట్ట వెంకటరాములు, సత్తిగాడి లక్ష్మి, జిల్లా సీనియర్ నాయకులు కుంటోళ్ల యాద య్య, సాముల్, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ప్రమోద్, పొశెట్టి, పురుషోత్తం, బాలరాజు, పద్మారావు, లావణ్య, బట్ట రమేష్, పొంగల భూమేష్, రాజనర్సయ్య, యాద య్య తదితరులు పాల్గొన్నారు.