calender_icon.png 4 April, 2025 | 1:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా పాలనలో అక్రమ అరెస్టులా..

03-04-2025 04:57:05 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గోడిసెల కార్తీక్ అన్నారు. యూనివర్సిటీ భూముల అమ్మకాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమానికి వెళ్లకుండా పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... అరెస్టులతో ప్రజా ఉద్యమాలు ఆపలేరని హెచ్సియు భూముల పరిరక్షణకు పోరాటాలు చేపడతామని స్పష్టం చేశారు. భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీని నిర్వీర్యం చేసే కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. అరెస్ట్ అయిన వాటిలో డివైఎఫ్ఐ మండల అధ్యక్షుడు నిఖిల్, తిరుపతి ఉన్నారు.