calender_icon.png 23 March, 2025 | 2:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు

22-03-2025 05:47:33 PM

బిఆర్ఎస్వి నాయకులు ఎండి ముస్తఫా..

మందమర్రి (విజయక్రాంతి): విజయ రంగానికి బడ్జెట్లో 15% నిదులు కేటాయించి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం సమస్యల పరిష్కారం కోసం ఉద్యమిస్తున్న విద్యార్థి నాయకుల అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని బిఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు ఎండి ముస్తాఫా ఆన్నారు. విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీ ముట్టడికి వెళుతున్న బిఆర్ఎస్వి నాయకులను శనివారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకొని పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేవలం 23108 కోట్ల బడ్జెట్ ను విద్యా రంగానికి కేటాయించడం వల్ల విద్య పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టం అవుతుందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో సుమారు 8,000 కోట్లు విద్యార్థులకు రావాల్సిన స్కాలర్ షిప్, ఫీజు రియంబర్స్మెంట్, లు పెండింగ్ లో ఉన్నాయని వెంటనే వాటిని విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

బడ్జెట్ లో విద్యారంగా నికి కేటాయించిన నిధులు ఫీజు రీయింబర్స్మెంట్ కే  సరిపోని పరిస్థితి నెలకొందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం గంపెడు హామీలు ఇచ్చి బడ్జెట్ లో అరకొర కేటాయింపులు చేపట్టి విద్యా రంగాన్ని అధ:పాతాళానికి తొక్కడం దుర్మార్గం అని మండిపడ్డారు. ప్రతి విద్యార్థికీ 5 లక్షల విద్య భరోసా కార్డుకు బడ్జెట్ కేటాయింపులో సున్నా అని విమర్శించారు. ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ ఊసే లేదని,  ప్రతి మండలానికి ఒకటి అని చెప్పి నేడు నియోజకవర్గానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఇస్తామని అనడం దానికి బడ్జెట్ కేటాయించక పోవడం సిగ్గు చేటని ఆయన విమర్శించారు. 3 లక్షల లోపు వార్షికాదాయం ఉన్నవారికి, బీసీలకు మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్పి మోసం చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. విచారణ సమస్యలు పరిష్కారం అయ్యేవరకు బిఆర్ఎస్వి ఆందోళనలను కొనసాగిస్తుందన్నారు. కాగా అరెస్ట్ అయిన వారిలో బిఆర్ఎస్వీ పట్టణ ఉపాధ్యక్షులు దాసరి నవీన్, ఎండి తాజ్ లు ఉన్నారు.