సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు బూడిద గణేష్
మంథని, (విజయక్రాంతి): మంథని లో అక్రమ అరెస్టులతో ప్రజా ఉద్యమాలను ఆపలేరని సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు బూడిద గణేష్ అన్నారు. చలో హైదరాబాద్ కార్యక్రమానికి వెళ్తున్న మున్సిపల్ కార్మికులను మంథని పోలీసులు ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు బూడిద గణేష్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి కార్మికులను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కొరకు చలో హైదరాబాదుకు వెళుతున్న మున్సిపల్ కార్మికులను ముందస్తుగా అక్రమంగా అరెస్టు చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించే వరకు పోరాటాలు కొనసాగిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అరెస్ట్ అయిన వారిలో చిప్పకుర్తి చందు, సింగారపు గట్టయ్య, మల్లేష్, జంపయ్య, అశోక్, సమ్మయ్య, దేవేందర్, రాజేందర్ ,భాగ్య, సుక్కమ్మలు, ఉన్నారు.