నల్లగొండ జిల్లా అంటేనే పోరాటాల అడ్డా. ఉద్యమాల జిల్లాగా పేరుంది. నల్లగొండను కేంద్రంగా చేసుకొని తెలంగాణ ఉద్యమం, గ్రంథాలయ ఉద్యమాలు, భూదానోద్యమాలు ఇలా అనేక ఉద్యమాలు జరిగాయి. ఇవన్నీ నకిరేకల్‌కు చెందిన పొడుపుగంటి మోహన్‌ను కదిలించాయి. పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, విద్యార్థి నాయకుడిగా తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు.
స్వరాష్ట్ర సాధనలో విద్యార్థుల పాత్రపై అనేక కార్యక్రమాలు నిర్వహించి ఉద్యమాన్ని ముందుకుతీసుకెళ్లాడు. ఈ సందర్భంగా ఉద్యమంలో తన పాత్ర గురించి ‘విజయక్రాంతి’తో పంచుకున్నాడు ఇలా.
నాది నల్లగొండ జిల్లా నకిరేకల్ టౌన్. చిన్నప్పట్నుంచే ఉద్య మ భావజాలం ఎక్కువ. నకిరేకల్ కేంద్రంగా అనేక ఉద్యమ కార్యక్రమాలు జరగడమే అందుకు కారణం. నిత్యం ఏదో ఘటనపై జరిగే ధర్నాలు, ఆందోళనలు నన్ను కదిలించేవి. దాంతో ఉద్యమానికి ఆకర్షితమై 2009లో ‘తెలంగాణ స్టూడెంట్ ఆర్గనైజేషన్’లో జాయిన్ అయ్యా.
ఈ ఆర్గనైజేషన్ ద్వారా అనేక ప్రజా సమస్యలపై ఆందోళన కార్యక్రమాలు చేశా. ముఖ్యంగా విద్యార్థుల సమస్యలపై అనేక ధర్నా కార్యక్రమాలు చేయడంతో ‘తెలంగాణ స్టూడెంట్ ఆర్గనైజేషన్’ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా పనిచేసే అవకాశం దక్కింది. విద్యార్థుల సమస్యలే లక్ష్యంగా చేసుకొని ఫీజు రీయంబర్స్‌మెంట్ అంశంపై పోరాటం చేశా.
అప్పట్లో నాలాంటి విద్యార్థి నేతలతో కలిసి సచివాలయాన్ని ముట్టడించి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు చేశా. ఫలితంగా అనేకసార్లు లాఠీదెబ్బలు తినాల్సి వచ్చింది. ఫీజు రీయంబర్స్‌మెంట్ సాధించడంలో నాలాంటివాళ్ల పాత్ర ఎంతో ఉంది. అంతేకాదు.. తెలంగాణలోని యూనివర్సిటీల్లో మహిళలపై జరిగిన లైంగిక వేధింపులు అరికట్టి, కారకులైనవారిని సస్పెండ్ చేయించా.
విద్యార్థులు ప్రేరేపితం..
విద్యార్థి ఉద్యమలతో తెలంగాణ ఉ ద్యమం కదిలించవచ్చునని నమ్మి అనేక జిల్లాల్లో పర్యటించా. పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలో తెలంగాణ స్వరాష్ట్రం కోసం వందల సంఖ్యలో సెమినార్లు నిర్వహించా. నార్త్ తెలంగాణ ఇన్‌చార్జిగా కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, హైదరాబాద్, నల్లగొండ అన్ని జిల్లాలో ఉద్యమంలో విద్యార్థుల పాత్రపై అనేక సదస్సులు నిర్వహించా.
ఫలితంగా ఎంతోమంది విద్యార్థులు ఆయా జిల్లా ల్లో వంటావార్పు, ర్యాలీలు, ధర్నాలు చేశారు. ఉద్యమంలో భాగంగా ప్రజా ఉద్యమాల పోరాట వనిత విమలక్కతో కలిసి ధూంధాం, మిలియన్ మార్చ్, దీ క్షా దీవాస్ లాంటి కార్యక్రమాల్లో పాల్గొ న్నా. అయితే ఈ క్రమంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉద్యమాన్ని సైతం విడిచిపెట్టలేదు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన త ర్వాత మూతపడిన కాలేజీలను ప్రభు త్వం స్వాధీనం చేసుకొని ప్రతి నియోజకవర్గానికి ఇంజినీరింగ్ కళాశాలను ఏర్పా టు చేయాలనే లక్ష్యంగా ఫైట్ చేశా. ఈ కార్యక్రమాలన్నీ విద్యావేత్త చుక్కారామయ్యకు నచ్చడంతో మరింత ప్రోత్సహి ంచారు. అలా ఉద్యమం ప్రారంభం నుం చి చివరి వరకు కీలక పాత్ర పోషించా.
బాలు జాజాల