18-03-2025 01:43:04 AM
మాజీ మంత్రి జోగు రామన్న
ఆదిలాబాద్, మార్చ్ 17 (విజయ క్రాంతి) : ఆదిలాబాద్ లోని సీసీఐ పరిశ్రమ తుక్కు మాత్రమే విక్రయిస్తున్నామని పరిశ్రమ ను కాదని ఆ శాఖకు చెందిన కేంద్రమంత్రితో పార్లమెంటు సమావేశాల్లో ప్రకటన చెయించాలని, లేని పక్షంలో అఖిలపక్షం నేతలతో కలిసి ఆందోళనకు సిద్ధమవుతామని మాజీ మంత్రి జోగు రామన్న వెల్లడించారు.
గత ప్రభుత్వం లో మంత్రి గా రాష్ట్ర అభివృద్ధిపై చిత్తశుద్ధితో పనిచేశమే తప్ప నీచ రాజకీయాలకు ఎప్పుడు పాల్పడలేమని, బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా ఉండి పాయల్ శంకర్, సువాసిని రెడ్డి లు రైతులను రెచ్చగొడుతూ నీచ రాజకీయాలు చేశారని జోగు రామన్న మండిపడ్డారు. స్థానిక బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవారం మాజీ మంత్రి సమక్షంలో బీజేపీ పార్టీకి చెందిన నాయకులు భగత్ నరేష్, రాచర్ల శరత్ లు బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం జోగు రామన్న మాట్లాడుతూ
స్థానికంగా బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు ఉన్నారని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పటికీ పరిశ్రమను పునర్దరించ లేక పోతు న్నారని ఎద్దేవ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.