calender_icon.png 6 April, 2025 | 7:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిమెంట్ ఫ్యాక్టరీ సాధించే వరకు ఉద్యమం

20-03-2025 01:59:25 AM

మాజీ మంత్రి రామన్న

ఆదిలాబాద్, మార్చ్ 19 (విజయక్రాంతి) : ప్రాణం ఉన్నంత వరకు సీసీఐ సిమెంట్ పరిశ్రమ కోసం పోరాటం చేస్తానని, ఫ్యాక్టరీ పునరుద్ధరనపై కేంద్రం ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే స్పష్టమైన హామీని ప్రకటించాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు జోగు రామన్న డిమాండ్ చేశారు.

ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం సీసీఐ సాధన కమిటి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట చేపట్టిన రిలే నిరాహార దీక్షలను బుధవారం ఆయన ప్రారంభించారు. సీసీఐ ఫ్యాక్టరీ ఆవశ్యకత, కేంద్రం అవలంబిస్తున్న విధానాలు, స్థానిక ప్రజా ప్రతినిధుల వైఖరిపై నేతలు సుదీర్ఘంగా చర్చించారు.

ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ఫ్యాక్టరీ పునరుద్ధరణకు నిధులు కేటాయించాలని నేతలు ముక్త ఖంటంతో డిమాండ్ చేశారు. ఈ మేరకు జోగు రామన్న మాట్లాడుతూ సీసీఐ పునరుద్ధరనకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయంలో అనేక మార్లు కేంద్రానికి విన్నవించామని, కేంద్ర మంత్రులను తాను స్వయంగా  పలు దఫాలుగా కలిసినా ఎటువంటి స్పందన రాలేదన్నారు. పలువురు సీసీఐ సాధన కమిటీ కన్వీనర్ మల్లేష్, పలువురు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.