- మోతీలాల్ నిరాహార దీక్ష విరమించాలి
- నిరుద్యోగుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లా
- ఎమ్మెల్సీ కోదండరాం
నిజామాబాద్, జూలై 1 (విజయక్రాంతి): విద్యార్థి నాయకులు నిరుద్యోగ సమస్యల పరిష్కారానికి ఉద్యమాలు చేయాలి తప్ప ప్రాణాలు కోల్పోయే విధంగా ఉద్యమాలు చేయవద్దని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. నిరుద్యోగ సమస్యలపై నిరాహారా దీక్ష చేస్తున్న మోతిలాల్ వెంటనే దీక్ష విరమించాలని కోరారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. తెలంగాణా విద్యార్థి యువజన వేదిక (టీవీయూవీ) ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్‌లో ఉత్తమ మార్కు లు సాధించిన విద్యార్థులకు సోమవారం నిజామాబాద్‌లోని అంబేద్కర్ భవన్‌లో ఎకడమిక్ ఎక్స్‌లెన్స్ అవార్డులు అందజేశారు, ఈ కార్యక్రమానికి ప్రొఫెసర్ కోదండరాం ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు ప్రతిభా అవార్డులను అందజేశారు.
ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. టీవీయూవి ఆధ్వర్యంలో విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమం గత నాలుగేళ్లుగా నిర్వహిస్తుండటం అభినందనీయం అన్నారు. నిరుద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో తెలంగాణా విద్యార్థి వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు నిజ్జన రమేశ్ ముదిరాజ్, నిజామాబాద్ దవాఖాన సూపరింటెం డెంట్ డాక్టర్ ప్రతిభారాజ్, టీవీయూవీ రాష్ట్ర అధ్యక్షుడు కేతావత్ లాల్‌సింగ్, జిల్లా అధ్యక్షుడు నవీన్ యాదవ్, సీనియర్ అడ్వోకేట్ ఆశానారాయణ తదితరులు పాల్గొన్నారు.
డీఎస్‌కు కోదండరాం నివాళి
కాంగ్రెస్ సీనియర్ నేత డీఎస్‌కు కోదండరాం నివాళి అర్పించారు. సోమవారం నిజామాబాద్ వచ్చిన ఆయన.. డీఎస్ ఇంటికి వెళ్లి డీఎస్ చిత్రపటానికి పూల మాల వేసి, శ్రద్ధాంజలి ఘటించారు.