calender_icon.png 13 March, 2025 | 6:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యమ బాట!

13-03-2025 01:23:32 AM

ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ 

  1. ఏప్రిల్ 1 నుంచి జిల్లాల్లో సదస్సులు.. ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు
  2. మే 4న రాష్ట్రస్థాయి ఉద్యోగ సదస్సు.. 15న జిల్లా కేంద్రాల్లో నిరసన
  3. జూన్ 9న మహాధర్నా

హైదరాబాద్, మార్చి 12 (విజయక్రాంతి): దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న తమ సమస్యల పరిష్కారానికి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లు విడుతలవారీగా ఉద్యమ బాట చేపట్టనున్నారు. ఈ మేరకు ఉద్యమ కార్యాచరణను తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్ష నర్ల జాయింట్ యాక్షన్ కమిటీ (తెలంగాణ ఉద్యోగుల జేఏసీ) ప్రకటించింది.

టీఎన్జీవో భవన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన టీజేఏసీ సమావేశంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడి యా సమావేశంలో ఉద్యమ కార్యాచరణను టీజేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు ప్రకటించారు.

తొలుత జిల్లాల్లో సదస్సులు నిర్వహించి, ఎమ్మెల్యేలకు తమ సమస్యలపై వినతిపత్రాలను అందజేస్తామని చెప్పారు. ఏప్రిల్ 1 నుంచి 30 వరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. మే 4న రాష్ట్ర స్థాయి ఉద్యో గ సదస్సును నిర్వహించనున్నట్లు తెలిపారు. మే 15న జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలను చేపట్టి, జూన్ 9న రాష్ట్ర స్థాయి మహాధర్నాను నిర్వహిస్తామని తెలిపారు.

రాష్ట్రంలో ఉద్యోగుల పెండింగ్ బిల్లులను వెంటనే మంజూరు చేయాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఉద్యోగ సంఘాలతో క్యాబినెట్ సబ్‌కమి టీ సమావేశాన్ని ఏర్పాటుచేసి సమస్యలపై చర్చించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆర్థికేతర డిమాండ్‌లన్నింటిని పరిష్కరించాలని, సాధారణ బదిలీలు మే, జూన్ నెలల్లో చేపట్టాలన్నారు.

ఉద్యోగులు, పెన్షనర్లకు పే రివిజన్ కమిటీ సిఫార్సులను వెంటనే తెప్పించుకుని 51% ఫిట్‌మెంట్‌తో నూత న వేతనాలు మంజూరు చేయాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ముజీబ్, మధు సూదన్ రెడ్డి, పుల్గం దామోదర్ రెడ్డి, చావ రవి, జి. సదానందం గౌడ్, ఎం.రాధాకృష్ణ, పి. యాదగిరి, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.