calender_icon.png 27 February, 2025 | 12:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేటీపిఎస్ కాలనీలో పందుల సంచారం

26-02-2025 08:22:44 PM

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ పరిధిలోని కేటీపీఎస్ కాలనీలో పందుల సంచారం విచ్చలవిడిగా సాగుతోంది. పందులను కొందరు కాపలాదారుడు ఆటోలో తెచ్చి కాలనీలో వదిలి వెళుతున్నట్లు సమాచారం. బుధవారం సాయంత్రం కేటీపీఎస్బీ కాలనీ హాస్పిటల్ సమీపంలో పందుల గుంపు సంచరించటం గమనార్హం. కాలనీకి ప్రవేశించే ద్వారాల వద్ద పటిష్టమైన నిఘా లేకపోవడంతో పందులు, పశువుల సంచారంతో పాటు అపరిచితులు సంచారం పెరుగుతోందని కాలనీవాసులు వాపోతున్నారు. సిబ్బంది లేని కారణంగా క్వార్టర్ల పరిసర ప్రాంతాలు చెత్తాచెదారం ఉండటంతో పాటు, అంధకారం సైతం తాండవిస్తోంది. దీంతో అసాంఘిక కార్యక్రమాలకు నిలయాలుగా మారుతున్నట్లు తెలుస్తోంది.