calender_icon.png 21 September, 2024 | 1:54 AM

జైనూర్ ఘటనకు నిరసనగా ఉద్యమం

21-09-2024 12:19:00 AM

నేడు రాష్ర్ట బంద్‌కు ఆదివాసీల పిలుపు

ఆదిలాబాద్, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): కుమ్రం భీం ఆసిఫాబా ద్ జిల్లాలో ని జైనూరులో ఆదివాసీ మహిళపై లైంగిక దాడి, హత్యాయత్నానికి నిరసనగా ఆదివాసీ లు ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. ఈ నే పథ్యంలోనే శనివారం తెలంగాణ బ ంద్‌కు పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ లో ఆదివాసీ హక్కుల పోరాట సమితి(తుడుం దెబ్బ) రా ష్ర్ట కార్యనిరహ ణ అధ్యక్షుడు గోడం గణేష్ శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు మాట్లాడారు. బంద్‌ను విజయవంతం చే యాలని పిలుపునిచ్చారు. ఈ బంద్ కార్యక్రమంలో తుడుం దెబ్బ అనుబంధం సంఘా లు, ఉద్యోగ, ఉపాధ్యాయులు, అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని కోరారు. సమావేశం లో తుడుం దెబ్బ నాయకులు వెట్టి మనోజ్, సలాం వరుణ్, ఆత్రం గణపతి, వెడమ ము కుందరావు, తోడశం ప్రకాష్, మెస్రం తులసి రాం పటేల్, కోట్నాక్ రామారావు, కుమ్ర గో విందరావు పాల్గొన్నారు.