calender_icon.png 21 April, 2025 | 3:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వృథా బస్ షెల్టర్లు తరలించండి

26-11-2024 12:00:00 AM

హైదరాబాద్ మహానగరం రోజురోజుకూ విస్తరిస్తోంది. నగర ప్రజలే కాకుండా బయటి జిల్లానుంచి రోజూ వేలాదిమంది నగరానికి వస్తుంటారు.వీళ్లందరికీ ప్రధాన ప్రయాణ సాధనం సిటీ బస్సులే.  ఉదయం, సాయంకాలాల్లో  ఏ బస్టాప్ దగ్గర చూసినా స్కూలు పిల్లలు మొదలుకొని ఉద్యోగులు, మహిళలు పదుల సంఖ్యలో బస్సుల కోసం వేచి ఉండడం కనిపిస్తుంది.

అయితే చాలా బస్టాపుల్లో షెల్టర్లు లేవు.  ఎండయినా, వానయినా జనం అలాగే స్టాపుల్లో వేచి ఉండాలి. లేకుంటే బస్సు దొరకదు. కానీ గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నగరంలో వందల సంఖ్యలో బస్ షెల్టర్లను అట్టహాసంగా ప్రారంభించారు. 

వాటిపై ప్రకటనలు, లైట్లు వెలిగిపోతూ ఉండేవి. అయితే అవసరం లేని చోట కూడా షెల్టర్లు నిర్మించి ప్రజాధనాన్ని వృథా చేశారనే విమర్శలు అప్పట్లోనే వచ్చాయి. అంతేకాదు, ఈ షెల్టర్లపై వాణిజ్య ప్రకటనల పేరిట ఓ పెద్ద కుంభకోణమే జరిగిందన్న ఆరోపణలూ వచ్చాయి. ఇప్పడు చాలా షెల్టర్లు  ఎవరికీ ఉపయోగపడకుండా పడి ఉన్నాయి. వాటిని షెల్టర్లు లేని బస్టాప్‌ల వద్దకు తరలిస్తే జనానికి ఉపయోగంతో పాటు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ఈ దిశగా జీహెచ్‌ఎంసీ అధికారులు దృష్టిపెట్టాలి.

  కె. కృష్ణకాంత్,ఉప్పల్