25-02-2025 01:10:22 AM
-స్వచ్ఛతకు ప్రాముఖ్యత ఇవ్వండి
-మున్సిపల్ అధికారులతో జిల్లా అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్
మహబూబ్ నగర్, ఫిబ్రవరి 24 (విజయ క్రాంతి) : పట్టణంలో స్వచ్ఛతకు ప్రముఖ ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా అదనప కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరం నందు ఏర్పాటుచేసిన సమావేశంలో మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి తోపాటు వివిధ విభాగాల అధికారులతో ప్రత్యేకంగా మాట్లాడారు. 2025-స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమాన్ని సమర్ధవంతంగా ముందుకు తీసుకుపోవాలని సూచించారు. ప్రతి వార్డులోనూ పక్కా ప్రణాళికలతో చిత్త సేకరణ చేయాలని, అపరిశుభ్రతకు తావు లేకుండా చూడాలని ఆదేశించారు. వివిధ విభాగాల అధికారులు వారి కి అప్పజెప్పిన పద్ధతులను సమర్ధవంతంగా నిర్వర్తించాలని, ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు ఉన్నారు.