23-04-2025 12:36:12 AM
కల్లూరు,ఏప్రిల్22:-వేసవికాలంలో మామిడి పండ్లు తినాలని ప్రతి ఒక్కరు భావిస్తారు ఎందుకంటే మామిడి పండ్లు కేవలం వేసవికాలంలోనే విరివిగా లభిస్తాయి. మా మిడిపండు రుచి మరే ఇతర పండులోనూ ఉండదు. అందుకే మామిడి పండ్లు తినేందుకు ఇష్టపడతారు. మామిడి పండును పం డ్లలో రారాజు అంటారు.అయితే క్బాడ్తో పం డిన మామిడి పండ్లను కొన్నట్లయితే, జబ్బులను ఆహ్వానించినట్లే.
రసాయనాలతో పండి న మామిడి పండ్లను తినడం వల్ల చాలా సార్లు ఆరోగ్యం కూడా పాడైపోతుంది. అం దుచేత చెట్లకు మామిడి పండ్లను తినడం లే దా పచ్చి మామిడి పండ్లను ఇంట్లోనే మగ్గబెట్టి తినడం మంచిది. రసాయనాలు లేకుం డా ఇంట్లో పచ్చి మామిడి పండ్లను ఎలా మగ్గబెట్టాలో తెలుసుకుందాం
కొందరు వ్యాపారుల అత్యాశ కారణంగా. .
మామిడి విషతుల్యంగా మారుతోంది. కా యలను కృత్రిమంగా మాగబెట్టి.. మార్కెట్లకు తరలిస్తున్నారు. మాగబెట్టడం కోసం నిషేధిత కాల్షియం క్బాడ్, ఇతర ప్రమాదకర రసాయనాలను తొందరగా పక్వానికి వచ్చేలా..ఇదంతా ఎలా ఉన్నా.. అసలు సమ స్య అక్కడే మొదలవుతోంది. వ్యాపారులకు విక్రయించని రైతులు.. పండ్ల పండాక కోసి.. మార్కెట్లకు తరలిస్తారు.
కానీ.. వ్యాపారులు కొనుగోలు చేసిన తోటల్లో.. పండ్లు పూర్తిగా పండకముందే.. కోస్తున్నారు. వాటికి రసాయనాలు పూసి.. తొందరగా పక్వానికి వచ్చే లా చేస్తున్నారు. ఇలా చేయడంతో ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది. వాటిని ఇతర పట్టణాలు, నగరాలకు తరలించి విక్రయిస్తున్నారు.
నిబంధనల ప్రకారం
ఆహార భద్రత, ప్రమాణాల నిబంధనలు ప్రకారం.. ప్రభుత్వం క్బాడ్, ఎసిటిలిన్ రసాయనాలను నిషేధించింది. సహజంగా పం డించే ఇథిలిన్ను మాత్రమే కొంత వరకు వినియోగించేందుకు అనుమతిచ్చింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం..
సుమారు 20 కిలోల పండ్లకు 5 గ్రాముల ఇథిలిన్ను వినియోగించాల్సి ఉంటుంది. మేలిమి పండులా కని పించేందుకు వ్యాపారులు క్బాడ్ను వినియోగిస్తున్నారు. ఆమోదించిన ఇథిలిన్తో పోలిస్తే క్బాడ్, ఇతర రసాయనాలు మార్కెట్లో చౌక గా లభిస్తుండటంతో వీటిని వ్యాపారులు ఇష్టానుసారంగా వాడుతున్నారు. వీటి వినియోగం వల్ల ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వేసవిలో అందరూ దీన్ని ఎంతో ఇష్టంగా తింటారు. వేసవి కాలంలో ఎక్కడ చూసినా వివిధ రకాల మామిడి పండ్లను విక్రయిస్తా రు. అన్ని వయసుల వారికి మామిడిపం డ్లు అంటే చాలా ఇష్టం, చుట్టుపక్కల మామిడిపండ్లు దొరక్కపోతే దూరప్రాంతాల నుంచి మామిడి పండ్లను కొనుగోలు చేస్తుంటారు.
ముఖ్యంగా పచ్చి మామిడికాయలను సహజమైన పద్ధతుల్లో మగ్గ పెడితే తియ్యటి మా మిడి పండ్లు తయారవుతాయి. కానీ తొందరగా కారులో అసహజ పద్ధతుల్లో మామిడి పండ్లను మగ పెట్టేందుకు ప్రయత్నిస్తూ ఉం టారు ఇలా చేయడం ద్వారా కొన్ని రసాయనాలు శరీరంలోకి ప్రవేశించి పలు జబ్బు లకు కారణం అవుతూ ఉంటాయి.
పచ్చి మామిడికాయను బియ్యం సంచుల్లో మగ్గబెట్టాలి.
మీరు మామిడిని సులభంగా మగ్గబెట్టా లి. బియ్యంలో పండిన మామిడి ఆరోగ్యానికి కూడా మంచిది. బియ్యంలో మామిడిని పం డడానికి, మామిడిని 1-2 అడుగుల లోతులో ఉన్న బియ్యం పెట్టెలో పెట్టండి. 4-5 రోజుల వరకు దానికి ఎటువంటి భంగం కలిగించవద్దు. ఐదు రోజుల తర్వాత మీ మామిడి పూర్తిగా పక్వానికి వచ్చి సిద్ధంగా ఉంటుంది.