calender_icon.png 20 September, 2024 | 4:22 PM

ఆరేళ్ల వయసులో పర్వతారోహణ

09-09-2024 12:00:00 AM

  1. ప్రాణం నిలిపిన ఆసుపత్రి కోసం సాహసం 
  2. ఎత్తున పర్వతాన్ని ఎక్కి ఔరా అనిపించిన చిన్నారి

వియన్నా, సెప్టెంబర్ 8: తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడిన తనను కాపాడిన హాస్పిటల్‌కు విరాళాలు సేకరించేందుకు ఓ బాలిక సాహసం చేసింది. ఆరేండ్ల వయసులోనే ఎత్తున పర్వతాన్ని అధిరోహించి ఔరా అనిపించింది. ఆస్ట్రియాలోని వేల్స్‌కు చెందిన సెరెన్ ప్రిస్ నెలలు నిండకుండానే పుట్టింది. దీంతో తీవ్ర అనారోగ్య సమస్యలు వెంటాడగా.. బిర్మింగ్ హోమ్స్ చిల్డ్రన్స్ అనే ఆసుపత్రి రక్షించింది. ఆ హాస్పిటల్‌కు  విరాళాల రూపం లో డబ్బులు సమకూర్చాలని సెరెన్ నిర్ణయించుకుంది. తన తండ్రి గ్లిన్‌ప్రిస్‌తో కలిసి పర్వతాలు అధిరోహించడం అలవాటుగా చేసుకుంది.

తాజాగా ఉత్తర ఆఫ్రికాలోనే ఎత్తున మౌంట్ టౌబ్కల్‌ను ఎక్కింది. 2022లోనూ యూకేలోని స్కాట్లాండ్, ఇంగ్లాండ్, వేల్స్‌లోని ౩ ఎత్తున శిఖరాలను 48 గంటల్లోపే ఎక్కిన అతిచిన్న వయస్కురాలిగా సెరెన్ రికార్డు సాధి ంచింది. తన తండ్రితో గడపడం, పర్వత శిఖరాల నుంచి చూడడం తనకెంతో ఇష్టమని సెరెన్ చెబుతోంది. గ్లిన్ మాట్లాడుతూ.. ‘గతనెలలో మొరాకో వెళ్లి.. గైడ్ సహాయంతో 40 డిగ్రీల ఉష్ణోగ్రతల్లో 8 గంటలు నడిచి మౌంట్ టౌబ్కల్ బేస్ క్యాంపునకు చేరుకున్నాం. ఆ తర్వాతి రోజు పర్వతాన్ని అధిరోహించాం. పర్వత శిఖరాగ్రం మీద పలువురు సెరెన్ గురించి తెలుసుకొని  అభినందనలు తెలియజేశారు’ అని చెప్పారు.