హిమాచల్ ప్రదేశ్ రాష్ట మంత్రి రాజేశ్ ధర్మాణి
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 20 (విజయక్రాంతి): ఉస్మానియా యూనివర్సిటీలో అనుసరిస్తున్న అత్యుత్తమ విధానాలను హిమాచల్ ప్రదేశ్‌లో అమలు చేసేందుకు ప్రయత్నిస్తామని ఆ రాష్ట్ర సాంకేతిక విద్యా మంత్రి రాజేశ్ ధర్మాని అన్నారు. సోమవారం ఆయన నేతృత్వంలో 13మంది సభ్యులతో కూడిన హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధి బృందం ఓయూను సందర్శించింది.
పరీక్షల విభాగం, ఆర్ట్స్, ఇంజనీరింగ్ కాలేజీతో పాటు సివిల్ సర్వీసెస్ అకా తదితర విభాగాలను సందర్శించింది. ఈ సందర్భంగా వారు ఓయూ వీసీ ప్రొ.మొలుగారం, రిజిస్ట్రార్ ప్రొ.నరేష్‌రెడ్డితో భేటీ అయ్యారు. ఓయూతో విద్య, సాంకేతిక సహకారాల కోసం త్వరలో ఎంవోయూను రూపొందించుకొంటామని హిమాచల్ మ్రంతి రాజేశ్ ధర్మానీ తెలిపారు.