18-04-2025 12:00:00 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 17(విజయక్రాంతి) : నల్లాలకు అక్రమంగా బిగించిన మోటార్లను గురువారం జలమండలి సీజ్ చేశారు. జలమండలి ఓఅండ్‌ఎం డివిజన్ నారాయణగూడ పరిధిలోని పర్ధాగేట్ ప్రాంతంలో గల ఓ అపార్ట్‌మెంట్‌లో నల్లా మోటార్ బిగిస్తున్నట్లు జలమండలి విజిలెన్స్ అధికారులకు వాట్సప్ లో సమాచారం వచ్చింది.
స్పందించిన అధికారులు నీటి సరఫరా జరుగుతున్న సమయంలో తనిఖీలు నిర్వహించారు. ఆ అపార్ట్‌మెంట్‌లోని ఆరు అంతస్తుల్లో 6బోర్లను గుర్తించి సీజ్ చేశారు. కాగా లోప్రెజర్, నీటి సరఫరాలో సమస్యలున్న వినియోగదారు లు జలమండలి కస్టమర్‌కేర్ నంబర్ 155313కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయొచ్చని అధికారులు తెలిపారు.