calender_icon.png 24 February, 2025 | 7:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూల్స్ పాటించని వాహనదారులు

20-02-2025 01:10:10 AM

* విస్తృత తనిఖీలు, అవగాహన కల్పిస్తున్న మారని తీరు

* పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు

వనపర్తి, ఫిబ్రవరి 19 ( విజయక్రాంతి ) :  రోడ్డు ప్రమాదాలను కట్టడి చేసేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంగించే వారికి జరిమానాలు విధించడం ద్వారా నైనా కొద్దిగా దారికొస్తారని ఉద్దేశంతో వాహనాలను విస్తృతంగా  తనిఖీలను చేపడుతున్నారు.

అయినా పరిస్థితిలో మాత్రం మార్పు కనిపించడం లేదు. వాహనాలు నడిపేందుకు కనీస అరత 18 ఏళ్లుగా రవాణా శాఖ నిర్ణయించింది కానీ అంతకన్నా తక్కువ వయసున్న పిల్లలు కూడా వాహనాలు నడుపుతూ రోడ్లపై యదేచ్చగా తిరుగుతున్నారు. 

చిన్న చిన్న పనుల కోసం అని మైనర్లు బైక్ లను నడుపుతున్న తల్లిదండ్రులను చూసి చూడనట్లుగా  వ్యవహరిస్తున్నారె తప్ప పరోక్షంగా రోడ్డు ప్రమా దాలకు కారణం అవుతున్నారని మాత్రం తెలుసుకోవడం లేదు. యువత అయితే  త్రిబుల్ రైడింగ్ తో రయ్ మంటూ దూసుకెళ్తున్నారు. సిగ్నల్స్ జంప్ చేసే క్రమంలో వెహికల్ నెంబర్ కనిపించకుండా తప్పించుకుని తిరుగుతున్నారు 

 హెల్మెంట్ తప్పనిసరి అయినా ....

 బైకులు నడిపే వారిలో చాలామంది హెల్మెంట్ ధరించడం లేదు. రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నప్పుడే ఎక్కువమంది హెల్మెంట్ లేకపోవడం వలన తనకు బలమైన గాయాలు తగిలి ప్రాణాలు కోల్పోతు న్నారు. ప్రతి ద్విచక్ర వాహనదారుడు కచ్చితంగా హెల్మెంట్ ధరించాలని పోలీస్ శాఖ  విస్తృత ప్రచారం చేస్తున్నప్పటికీ హెల్మెంట్ ధరించేందుకు వాహనదారులు ఆసక్తి చూప డం లేదు. 

ఇష్టానుసారంగా వాహనాలను నడుపుతున్న వారిపై పోలీసులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వాహనాల నెంబర్లను ఫోటోలు తీసి ఆన్లున్లో అప్లోడ్ చేసి ఇంటికి చలాన్ లు పంపిస్తున్నాను. పోలీసుల తనిఖీల సమయంలో పట్టుబడితే ఏదో ఒక కారణం చెబుతూ తెలిసిన వారినుండి ఫోన్ లేదా మాట చెప్పిస్తే  సరి అనుకుంటూ వాహనదారులు వ్యవహరిస్తున్నా రు.  అతివేగంగా వాహనాలు నడిపి చాలా మంది ప్రమాదాలు జరిగి గాయాలు , మరణించిన సందర్భాలు జిల్లాలో చాలానే ఉన్నాయి. 

రోడ్డు ప్రమాదాల వివరాలు ఇలా

* 2023లో జిల్లా వ్యాప్తంగా 218 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోక 124 మంది మృతి చెందగా మరో 200 మంది గాయాల పాలయ్యారు.

* 2024లో 225 రోడ్డు ప్రమాదం చోటు చేసుకోగా 128 మంది మృతిచెందగా మరో 237 మంది గాయాల పాలయ్యారు.

*2025లో ఇప్పటి వరకు 12 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోగా 08 మృతి చెందగా 23 మంది గాయాల పాలయ్యారు. 

 పిల్లలకు వాహనాలు ఇవ్వవద్దు 

చిన్న చిన్న పనుల కోసం తల్లిదండ్రులు పిల్లలకు వాహనాలు ఇస్తున్నారు దీనివల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు సైతం ఎక్కువగా ఉన్నాయి. మై నర్లు వాహనాలు నడుపుతున్న  వారి తల్లిదండ్రులకు రోడ్డు ప్రమాదాల పట్ల ఇటీవల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ట్రాఫిక్ నిబంధన లు  పాటించాలి. జాగ్రత్తగా నడిపే వారి పై పోలీసు శాఖ కఠినంగా వ్యవహరిస్తుంది. 

- రావుల గిరిధర్, వనపర్తి జిల్లా ఎస్పీ