ఫ్యాన్సీ నంబర్లపై వాహనదారుల మోజు
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 26 (విజయక్రాంతి): ఫ్యాన్సీ నంబర్ల కోసం వాహనదారులు మొగ్గు చూపడంతో రవాణా శాఖకు భారీ ఆదాయం సమకూరుతోంది. హైదరాబాద్ ఆర్టీఏ పరిధిలోని సెంట్రల్ జోన్ ఖైరతాబాద్ పరిధిలో మంగళవారం ఫ్యాన్సీ నంబర్లకు అధికారులు ఆన్‌లైన్ బిడ్డింగ్ నిర్వహించారు. బిడ్డింగ్‌లో తాము కోరుకున్న నంబర్ల కోసం వాహనదారులు పోటీ పడ్డారు.
9 నంబర్లకు నిర్వహించిన బిడ్డింగ్ ద్వారా ఆర్టీఏకు రూ.52,52,283 ఆదాయం వచ్చినట్లు జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ రమేశ్ తెలిపారు. బిడ్డింగ్‌లో.. టీజీ 09డీ 0001 నంబర్‌కు రూ. 11,11,111, టీజీ 09డీ 0009 నంబర్‌కు రూ.10.40లక్షలు, టీజీ 09 సీ 9999 నంబర్‌కు రూ.7,19,999, టీజీ 09డీ 0006 నంబర్‌కు రూ.3.65లక్షలు, టీజీ 09డీ 0005 నంబర్‌కు రూ.3.45లక్షలు, టీజీ 09డీ0007 నంబర్‌కు రూ.2,06,569, టీజీ 09డీ 0019నంబర్‌కు రూ.1,95,009, టీజీ 09డీ 0099 నంబర్‌కు రూ.1.85లక్షలు, టీజీ 09డీ 0077నంబర్‌కు రూ.1,17,789 వచ్చినట్లు ఆర్టీఏ అధికారులు తెలిపారు.