calender_icon.png 12 April, 2025 | 6:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాహనదారులు రోడ్డు భద్రత నియమాలు పాటించాలి

04-04-2025 09:35:46 PM

ఎస్సై రాజశేఖర్

రామకృష్ణాపూర్: వాహనదారులు భద్రత నియమాలు పాటిస్తే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని రామకృష్ణాపూర్ పట్టణ ఎస్సై రాజశేఖర్ అన్నారు. గురువారం క్యాతన్ పల్లి హైవే వద్ద వాహనదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్సై రాజశేఖర్ వాహనదారులకు పువ్వులు అందించి రోడ్డు భద్రత నిబంధనలు తెలియజేశారు. వాహన దారులు భద్రత నియమాలు పాటించాలని పేర్కొన్నారు. వాహనదారులు హెల్మెట్, సీటు బెల్టు తప్పనిసరిగా ధరించాలని సూచించారు. మద్యం తాగి వాహనం నడపడం,రాష్ డ్రైవింగ్, అతివేగం అత్యంత ప్రమాదకరమని వివరించారు. సెల్ ఫోన్ లో మాట్లాడుతూ వాహనాలు నడిపి ప్రమాదాల బారిన పడొద్దని సూచించారు.ఈ కార్యక్రమాల్లో రెండోవ ఎస్సై లలిత,సిబ్బంది పాల్గొన్నారు.