calender_icon.png 2 April, 2025 | 7:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెత్తకు నిప్పు.. వాహనదారుల ఇబ్బందులు

31-03-2025 06:03:49 PM

బూర్గంపాడు (విజయక్రాంతి): బూర్గంపాడు మండలం సారపాక భద్రాచలం బ్రిడ్జి సమీపంలో బ్రిడ్జి పక్కన గల చెత్తకు నిప్పు అంటుకుంది. మంటలు చెలరేగి దట్టమైన పొగ ఏర్పడింది. దీంతో వాహనదారులకు ఎదుటి వాహనాలు కనిపించక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలు అదుపు చేశారు.